Kondayi Flood: వరదలతో గుండెకోత గురైన కొండాయి కోలుకుందా..? మరీ ఆ ఊరు సేఫేనా..?

| Edited By: Balaraju Goud

Jul 20, 2024 | 1:26 PM

గత ఏడాది వానలు వరదలు గుండెకోత మిగిల్చిన కొండాయి కోలుకుందా..? మళ్లీ వర్షాకాలం వచ్చేసింది. మరీ ఆ ఊరు సేఫేనా..? అక్కడి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది..? ఏం చేయబోతుంది.? కొండాయి ప్రజలకు దారి చూపడం కోసం సర్కారు మదిలో మెదిలిన ఆ సరికొత్త ఆలోచన ఏంటి..?

Kondayi Flood: వరదలతో గుండెకోత గురైన కొండాయి కోలుకుందా..? మరీ ఆ ఊరు సేఫేనా..?
Kondai Village Flood
Follow us on

గత ఏడాది వానలు వరదలు గుండెకోత మిగిల్చిన కొండాయి కోలుకుందా..? మళ్లీ వర్షాకాలం వచ్చేసింది. మరీ ఆ ఊరు సేఫేనా..? అక్కడి ప్రజలను ఆదుకోవడం కోసం ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది..? ఏం చేయబోతుంది.? కొండాయి ప్రజలకు దారి చూపడం కోసం సర్కారు మదిలో మెదిలిన ఆ సరికొత్త ఆలోచన ఏంటి..?

కళ్ళు మూసి తెరిచేలోగా ఊరుపై ఉప్పెరలా విరుచుకుపడ్డ జంపన్న వాగు కొండాయి గ్రామాన్ని కాకవికలం చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది జల సమాధి అయిపోయారు. గత ఏడాది జులై 27న జరిగిన ఈ విషాద సంఘటనను అందరికంటే ముందుగా టీవీ9 బాధ్యతాయుతంగా బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. వాళ్ల బాధలు బయటకు తెలియ పరచడమే కాకుండా కొండాయి ప్రజలకు మేమున్నాం అంటూ అండగా టీవీ9 ఉడతా భక్తిగా వారికి సహాయకచర్యలు అందించింది. టీవీ9 తో కలిసి వచ్చిన మానవతావాదులను కలుపుకుని కొండాయి ప్రజల కష్టాల్లో పాలుపంచుకుంది.

ఆ విషాద సంఘటనకు ఏడాది కావస్తుంది మరీ కొండాయి పరిస్థితి ఎలా ఉంది..? కొండాయి ప్రజలకు దారి చూపడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసుకునేందుకు మళ్లీ టీవీ9 ప్రయత్నించింది. గత ఏడాది సంభవించిన వరదల వల్ల కొండాయి దొడ్ల గ్రామాల మధ్య ఉన్న బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో వారికి తాత్కాలిక రోడ్లు నిర్మించారు. స్థానిక మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో ఈ వాగు పై తొమ్మిది కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో బ్రిడ్జి మంజూరు చేయించారు.

బ్రిడ్జి నిర్మాణం టెండర్ ప్రక్రియలో ఉండటంతో… వారికి దారి చూపడం కోసం సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే వాగుపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. రాష్ట్రంలోనే ఇది తొలి ప్రయత్నం. ప్రయోగాత్మకంగా ఆ దరిని.. ఈ దరిని కలుపుతూ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూపకల్పన చేశారు. ఐటీడీఏ నుండి మంజూరు చేసిన 35 లక్షల రూపాయల ప్రత్యేక నిధులతో ఈ గ్రామానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 120 మీటర్ల పొడవుతో ఐదు ఫీట్ల వెడల్పుతో పూర్తిగా ఐరన్ తో బ్రిడ్జి నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం మళ్లీ జంపన వాగు ఉప్పంగడంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది రాష్ట్ర సర్కార్.

జంపన్న వాగు అప్పొంగడంతో తొలి ప్రయోగానికి అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారికి హుటాహుటిన బోర్డ్స్ ఏర్పాటు చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించిన మూడు ప్రత్యేక బోట్స్ ను ఇక్కడ సిద్ధం చేశారు. వారికి సహాయక చర్యలు అందించడం కోసం శిక్షణ పొందిన స్విమ్మర్లు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ ఆఫీసర్లను నియమించింది ఈ మూడు నెలలు ఇక్కడే ఉండాలని ఆదేశించారు. కొండాయి – దొడ్ల గ్రామాల మధ్య రాకపోకలు సక్రమంగా కొనసాగేలా చేస్తున్నారు. ప్రస్తుతం విపత్తును ఎదుర్కోనేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. హెల్త్ సిబ్బందితోపాటు, రెవెన్యూ, ఐటీడీఏ, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా 12 మంది ఎన్ఢీఆర్ఎఫ్ సిబ్బందిని ఇక్కడ సిద్ధంగా ఉంచారు..

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారే సంఘటనలు ఎన్నో చూస్తున్నాం… కానీ ఇక్కడ పైలెట్ ప్రాజెక్టుగా ఫుటోవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఆ ఊరికి దారి చూపాలని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.. వారిలో భరోసా నింపాయి. వరదలు వచ్చిన ప్రతిసారీ నరకం అనుభవిస్తున్నామంటున్న స్థానికులు. ఈసారి జరుగుతున్న ముందస్తు చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే తమకు మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో పూర్తి భరోసా లభించింది అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…