Warangal: ఖిల్లా వరంగల్ సందుల్లో రాజకీయ వైరం.. ఒకే దారిలో ఎదురొచ్చిన నరేందర్‌, కొండా మురళీ కార్లు..

|

Aug 09, 2022 | 8:19 PM

MLA Narendar vs Konda Murali: ఖిల్లా వరంగల్ సందుల్లో అటు నుంచి ఎమ్మెల్యే నరేందర్ వాహనం.. ఇటు నుంచి కాంగ్రెస్ నేత కొండా మురళీ వాహనం. రెండూ ఓ ఇరుకు సందుల్లో ఎదురెదురు వచ్చాయి.

Warangal: ఖిల్లా వరంగల్ సందుల్లో రాజకీయ వైరం.. ఒకే దారిలో ఎదురొచ్చిన నరేందర్‌, కొండా మురళీ కార్లు..
Narendar Vs Murali
Follow us on

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. ఖిల్లా వరంగల్ సందుల్లో అటు నుంచి ఎమ్మెల్యే నరేందర్ వాహనం.. ఇటు నుంచి కాంగ్రెస్ నేత కొండా మురళీ వాహనం. రెండూ ఓ ఇరుకు సందుల్లో ఎదురెదురు వచ్చాయి. ఎవరో ఒకరు వెనక్కి తగ్గితేనే ఇంకొకరు ముందుకెళ్లేది. కానీ ఎవరు తగ్గాలి? ఎవరో ఒకరు అంత సులువుగా తగ్గితే అది రాజకీయ వైరం ఎలా అవుతుంది? అందుకే పెద్ద రచ్చయ్యింది. వెనక్కి తగ్గేదే లేదని భీష్మించాయి రెండు వర్గాలు.

ఓ వైపు వైట్‌ కలర్‌లో ఎమ్మెల్యే నరేందర్‌ అటుగా వెళ్తున్నారు. బ్లాక్ కారులో కొండా మురళీ వచ్చారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటన ఓ గంట పాటు పెద్ద యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ఈ వార్త క్షణాల్లో వరంగల్ నగరం మొత్తం వ్యాపించింది.

దీంతో రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో అనుచరుల వైపు నుంచి జై కొండా, జై నరేందర్ నినాదాలు మొదలయ్యాయి. పోలీసులు వచ్చి సర్దిచెప్పినా కంట్రోల్‌ కాని వ్యవహారంగా మారిపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పోలీస్‌ స్టయిల్లో కార్యకర్తలను చెదరగొడితే తప్ప సెట్ అవ్వలేదు.

ఒకరు బండి వెనక్కి తీస్తే తప్ప మరొకరు ముందుకు వెళ్లలేని పరిస్థితుల్లో కాసేపు ఉద్రిక్తంగా మారింది. చివరికి పోలీసులు బతిమలాడి, బామాలి నేతలను పంపించేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..