క్రిస్టియన్ల అభివృద్దికి ప్ర‌భుత్వం కృషి.. సంక్షేమ‌, అభివృద్ధి వివ‌రాలు వెల్ల‌డించిన‌ మ‌ంత్రి కొప్పుల‌

|

Dec 24, 2020 | 1:32 PM

తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియ‌న్ల అభివృద్దికి తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్...

క్రిస్టియన్ల అభివృద్దికి ప్ర‌భుత్వం కృషి.. సంక్షేమ‌, అభివృద్ధి వివ‌రాలు వెల్ల‌డించిన‌ మ‌ంత్రి కొప్పుల‌
Koppula Eshwar
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియ‌న్ల అభివృద్దికి తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ అన్నారు. క్రిస్మ‌స్ పండ‌గ‌ను నేప‌థ్యంలో క్రిస్టియ‌న్ సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు మంత్రి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. క్రిస్టియ‌న్ శాంతి,స‌హ‌నం, అహింస‌ల‌ను ప్ర‌బోధించారు అని గుర్తు చేశారు. ధ‌ర్మం కోసం ముంద‌కు సాగే వారంద‌రూ స‌త్యాన్ని నిర్భ‌యంగా ఆచ‌రిస్తార‌ని అన్నారు.

క్రిస్టియ‌న్ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంక్షేమ, అభివృద్ది కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను మంత్రి వెల్ల‌డించారు. న‌గ‌ర శివార్ల‌లోని కోకాపేట వ‌ద్ద రెండెక‌రాల‌లో ఆధునాత‌న క్రిస్టియ‌న్ భ‌వ‌నం నిర్మాణం కోసం 10 కోట్ల రూపాయ‌లు కేటాయించామ‌న్నారు. ప్ర‌తి యేటా 2 ల‌క్ష‌ల 40 వేల మంది పేద‌ల‌కు చీర‌లు, దుస్తుల‌తో కూడిన గిఫ్ట్ ప్యాక్ లు అంద‌జేస్తున్నామ‌ని పేర్కొన్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న‌లో క్రిస్టియ‌న్లు ఎటువంటి అభ‌ద్ర‌త‌కు లోను