హైదరాబాద్‎లో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో

| Edited By: Srikar T

Jul 19, 2024 | 8:13 PM

ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సృజనాత్మక విధానంలో ముందుకెళ్లడం, అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవడం తదితర అంశాల ద్వారా మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని బేగంపేటలో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్‌షో జరగనుంది.

హైదరాబాద్‎లో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షో
Union Minister Kishan Reddy
Follow us on
  • మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధన లక్ష్యంగా ఈ కార్యక్రమం
  • 29 ఫిబ్రవరి, 2024 నాటి క్రిటికల్ మినరల్ ఈ-ఆక్షన్ బిడ్డర్స్ ను వెల్లడించనున్న కేంద్రమంత్రి
  • ఈ సందర్భంగా DMF పోర్టల్ ను ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ,19 జూలై: ఖనిజ వనరులను సద్వినియోగం చేసుకునేందుకు సృజనాత్మక విధానంలో ముందుకెళ్లడం, అంతర్జాతీయంగా అమలవుతున్న ఉత్తమ పద్ధతులను అలవర్చుకోవడం తదితర అంశాల ద్వారా మైనింగ్ రంగంలో మరింత అభివృద్ధి సాధించే లక్ష్యంతో కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లోని బేగంపేటలో మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్‌షో జరగనుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఒన్నొవేటివ్ మినరల్ హంట్ టెక్నిక్స్ ను తెలుసుకోవడం, అందుబాటులో ఉన్న జియో ఫిజికల్ డేటా ఆధారంగా మైనింగ్ పై మరింత అవగాహన పెంచుకోవడం, మైనింగ్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మషీన్ లర్నింగ్ వంటి ఆధునిక సాంకేతికత వినియోగం అంశాల వినియోగం తదితర అంశాలపై ఈ హ్యాకథాన్, రోడ్ షోల్లో వివరించనున్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్రమంత్రి .. నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) పోర్టల్ ను ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా DMFకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఈ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుంది. 29 ఫిబ్రవరి, 2024 నాడు క్రిటికల్ మినరల్స్‎కు సంబంధించిన రెండో, మూడో విడత ఈ-ఆక్షన్ జరిగింది. శనివారం నాటి కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు.. ఈ రెండు విడతల వేలంలో ప్రిఫర్డ్ బిడ్డర్స్ పేర్లను వెల్లడిస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబేతోపాటు తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ గనుల శాఖ ఉన్నతాధికారులు.. మైనింగ్ రంగానికి సంబంధించిన ఔత్సాహికులు, పారిశ్రామికవేత్తలు పాల్గొననున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..