బైక్‌తో సహా బావిలో పడిన వ్యక్తి… 30 గంటలు నరకయాతన

| Edited By:

Jun 02, 2019 | 4:47 PM

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమొగిలి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నాగారం క్రాస్ రోడ్ వద్ద బైక్ అదుపుతప్పి సమీపంలోని 75 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. చీకటిలో జరిగిన ప్రమాదానికి అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత తేరుకున్నాక గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం స్థానిక పొలాల […]

బైక్‌తో సహా బావిలో పడిన వ్యక్తి... 30 గంటలు నరకయాతన
Follow us on

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన పరికెల రాజమొగిలి గురువారం సాయంత్రం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి బైక్‌పై వచ్చాడు. రాత్రి అక్కడే బస చేసి శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఇంటికి బయలుదేరాడు. నాగారం క్రాస్ రోడ్ వద్ద బైక్ అదుపుతప్పి సమీపంలోని 75 అడుగుల లోతున్న బావిలో పడిపోయాడు. చీకటిలో జరిగిన ప్రమాదానికి అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కాసేపటి తర్వాత తేరుకున్నాక గట్టిగా కేకలు వేసినా ఫలితం లేకపోయింది.

శనివారం ఉదయం స్థానిక పొలాల వద్దకు వెళ్తున్న రైతుకు రాజమొగిలి కేకలు వినపడటంతో బావి వద్దకు వెళ్లి చూశాడు. ఈ విషయాన్ని స్థానికులకు చేరవేసి తాళ్ల సాయంతో బాధితుడిని బయటకు తీశాడు. ప్రాణాలతో బయటపడిన రాజమౌళి తనను రక్షించినవారికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని పరామర్శించి అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు గ్రామానికి చేరుకుని స్థానికులకు కృతజ్ఞతలు చెప్పి రాజమొగిలిని ఇంటికి తీసుకెళ్లారు.