హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

| Edited By:

Mar 18, 2019 | 11:06 AM

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టెంట్ హౌస్ గోదాంలో అకస్మాత్తుగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల మధ్య ఇంత పెద్ద గోదాం ఉన్నప్పటికీ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు […]

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
Follow us on

హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ టెంట్ హౌస్ గోదాంలో అకస్మాత్తుగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది 3 గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగడంలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల మధ్య ఇంత పెద్ద గోదాం ఉన్నప్పటికీ ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 60 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అంచనా వేశారు.