Watch: రాత్రికి రాత్రే 6 మేకలు మాయం.. సీసీ కెమెరాలో షాకింగ్ దృశ్యాలు!

Updated on: Oct 06, 2026 | 5:22 PM

మహబూబ్‌నగర్‌లోని వంగూర్ గేట్ వద్ద రాత్రికి రాత్రే ఆరు మేకలు చోరీకి గురయ్యాయి. కారులో వచ్చిన దొంగలు మేకలను ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన నింపింది.

మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూర్ గేట్ సమీపంలో మేకల చోరీ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆరు మేకలను అపహరించుకుని వెళ్లారు. రాత్రి సమయంలో మేకలను లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. వాటిని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేకలను అపహరించే మొత్తం వ్యవహారం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఘటనకు సంబంధించిన దృశ్యాల్లో గుర్తుతెలియని వ్యక్తులు మేకలను కారులో తీసుకెళ్లడం స్పష్టంగా కనిపిస్తున్నాయి. మేకల యజమానులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆరు మేకలను ఎక్కడికి తరలించారు, ఈ చోరీ వెనుక ఎవరున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us