హైదరాబాద్ శివారులో మరో చిరుత

|

May 29, 2020 | 8:01 AM

లాక్‌డౌన్ ఏం చేసిందో ఏమో కానీ అడవిలోని జంతువులు జ‌నావాసాల్లోకి వస్తున్నాయి. అట‌వీ ప్రాంత స‌మీపంలో వ‌స్తే త‌ప్పిపోయి వ‌చ్చాయ‌నుకోవ‌చ్చు. కానీ హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా చిరుత‌లు కనిపించటం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గత నెలరోజులుగా చిరుత సంచారం జనంకు నిద్రలేకుండా చేస్తున్నాయి. హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదికారులు ప్రయత్నించినా, ఆ చిరుత పట్టుబడకపోవడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. నల్లమల అడవుల నుంచి ఎలా బయటకు వచ్చిందో […]

హైదరాబాద్ శివారులో మరో చిరుత
Follow us on

లాక్‌డౌన్ ఏం చేసిందో ఏమో కానీ అడవిలోని జంతువులు జ‌నావాసాల్లోకి వస్తున్నాయి. అట‌వీ ప్రాంత స‌మీపంలో వ‌స్తే త‌ప్పిపోయి వ‌చ్చాయ‌నుకోవ‌చ్చు. కానీ హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా చిరుత‌లు కనిపించటం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. గత నెలరోజులుగా చిరుత సంచారం జనంకు నిద్రలేకుండా చేస్తున్నాయి.

హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదికారులు ప్రయత్నించినా, ఆ చిరుత పట్టుబడకపోవడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. నల్లమల అడవుల నుంచి ఎలా బయటకు వచ్చిందో తెలియదు కాని ,మైలార్ దేవుల పల్లి ప్రాంతంలో చిరుత కనిపించింది. అది ఒక వ్యక్తిని గాయపరిచింది. దానిని పట్టుకోవడానికి అటవీ అధికారులు ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నారు. అది ఎలా తప్పించుకుందో తెలియదు కాని ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రంలో దాక్కుందని భావించారు.

తాజాగా అది కాస్తా ఇప్పడు హైదరాబాద్ రాజేంద్రనగర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో కనిపించింది. చిరుత సంచరించే దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.  చిరుతను సీసీ కెమెరాలో చూసిన వర్సిటీ సెక్యూరిటీ గార్డులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు చిరుత కోసం గాలిస్తున్నారు.