Telangana: సాయంత్రం 6 తరువాత గడపదాటి బయటకు రావొద్దు.. ఫారెస్ట్ అధికారుల ప్రకటన.. అసలు మ్యాటర్ ఏంటంటే..

|

Sep 20, 2022 | 9:15 AM

Telangana: రాత్రి 6 గంటలు దాటితే.. గడపదాటి బయటకు రావొద్దు. వచ్చారో.. అంతే. మీ ప్రాణాలు మీ చేతిలో ఉండవంటూ ఫారెస్ట్‌ అధికారుల వార్నింగ్‌.

Telangana: సాయంత్రం 6 తరువాత గడపదాటి బయటకు రావొద్దు.. ఫారెస్ట్ అధికారుల ప్రకటన.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Leopard
Follow us on

Telangana: రాత్రి 6 గంటలు దాటితే.. గడపదాటి బయటకు రావొద్దు. వచ్చారో.. అంతే. మీ ప్రాణాలు మీ చేతిలో ఉండవంటూ ఫారెస్ట్‌ అధికారుల వార్నింగ్‌. ఇంతకు ఈ హెచ్చరిక ఎందుకు చేశారు? ఏం ముంచుకొస్తోంది? వివరాలు తెలుసుకుందాం.. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్‌లోని కృషి విజ్ఞాన కేంద్రం పరిసరాల్లో చిరుత పులి సంచరిస్తోంది. మూడు, నాలుగు రోజుల నుండి స్థానికంగా కనిపించడంతో అధ్యాపకులు, విద్యార్థులతో పాటు.. అక్బర్ నగర్ గ్రామస్థులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఫుడ్‌ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజీ దగ్గర అటెండర్‌కు ఈ నెల 15న చిరుత కనిపించింది. వెంటనే ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. స్పాట్‌ను పరిశీలించిన ఫారెస్ట్‌ అధికారులు స్థానికంగా చిరుత సంచరిస్తుందని క్లారిటీ ఇచ్చారు. ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు అలర్ట్‌గా ఉండాలని రాత్రి 8 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. ఒంటరిగా ఉండకుండా.. గుంపులు గుంపులుగా తిరుగాలని సూచించారు. చిరుతను పట్టుకునేందుకు బోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు ఫారెస్ట్‌ అధికారులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..