Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం.. పులి అడుగులను గుర్తించిన రైతులు..

|

Jan 17, 2021 | 10:47 AM

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో..

Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం.. పులి అడుగులను గుర్తించిన రైతులు..
Follow us on

Rajanna Sircilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుతపులి సంచారం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. రెండు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్‌లో చిరుత కనిపించింది. మళ్లీ ఇవాళ తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో సంచరించినట్లు తెలుస్తుంది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. దీంతో విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. అయితే రెండు రోజుల క్రితం వ్యవసాయ బావిలో పడింది చిరుత. గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆతర్వాత అధికారుల సమాచారంతో హైదరాబాద్‌ రెస్క్యూ టీమ్ ఘటన స్థలానికి చేరుకుంది. రెస్క్యూ టీమ్ వచ్చే లోగా తప్పించుకుంది. మళ్లీ మారుపాక ప్రాంతంలో చిరుత సంచరిస్తుండటంలో ప్రజలు భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు. వెంటనే చిరుతను బంధించాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Corona Cases in Telangana: తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు.. ఇద్దరు మృతి.. యాక్టివ్ కేసులు ఎన్నంటే..

Malabar Express : మలబార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం.. ప్రయాణికులను దించేసిన అధికారులు..