Leopard Fear: రాజన్న సిరిసిల్లలో చిరుత పులి కలకలం.. వ్యవసాయ బావిలో పడ్డ చిరుత.. రంగంలోకి అటవీ ధికారులు..

|

Jan 13, 2021 | 3:56 PM

Leopard Fear: తెలంగాణ ప్రజలను వన్యమృగాలు వణికిస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి కలకలం రేగింది. జిల్లాలోని..

Leopard Fear: రాజన్న సిరిసిల్లలో చిరుత పులి కలకలం.. వ్యవసాయ బావిలో పడ్డ చిరుత.. రంగంలోకి అటవీ ధికారులు..
Follow us on

Leopard Fear: తెలంగాణ ప్రజలను వన్యమృగాలు వణికిస్తున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి కలకలం రేగింది. జిల్లాలోని బోయిన్‌పల్లి మండలం మల్కాపూర్ శివారులో గల ఓ వ్యవసాయ బావిలో చిరుత పులి పడిపోయింది. అయితే బావి నీటిలో ఏదో అలజడి అవుతుండటంతో స్థానిక రైతు బావిలో చూడగా చిరుత పులి కనిపించింది. దాంతో హడలిపోయిన అతను గ్రామస్తులకు సమాచారం అందించాడు. బావిలో పడిన చిరుతను చూసేందుకు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకున్నారు. చిరుత గురించిన సమాచారాన్ని పోలీసులు, అటవీ శాఖ అధికారులకు అందించారు. వెంటనే అలర్ట్ అయిన అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. బావిలో పడిన చిరుతను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, చిరుత పులి బావిలో పడిన నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణంలో ఏ వైపు నుంచి ఏ క్రూర జంతువు వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలాఉంటే.. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మనిషి రక్తానికి రుచి మరిచిన పులిని బందించేందుకు అటవీ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఆ పులిని పట్టుకోవడానికి దాదాపు 40 రోజులకు పైగా అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఫలితం రావడంలేదు. ఇలాంటి తరుణంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులి కలకలం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది.

Also read:

Vehicle Sales Increased: కరోనా సీజన్‌లోనూ పెరిగిన వాహనాల విక్రయాలు.. యూనిట్ల వివరాలు వెల్లడించిన ఫాడా

Sai Pallavi : పవన్ కళ్యాణ్ సినిమాకు ఫిదా బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.. కానీ