Telangana: రీల్స్ పైత్యం ముదిరిందా..? మీ తిక్క కుదిర్చేది జైల్లోనే

|

Aug 26, 2024 | 10:46 AM

తిక్కల పనులు చేస్తూ.. ఒక్కరోజులో సెలబ్రిటీ అయిపోతామంటే ఇకపై కుదరదు. హద్దు దాటి ప్రవర్తించినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇప్పటికే మీరు అలాంటి పనులు చేసినా యాక్షన్ ఫేస్ చేయాల్సిందే.

Telangana: రీల్స్ పైత్యం ముదిరిందా..? మీ తిక్క కుదిర్చేది జైల్లోనే
Dance Reels (representative image)
Follow us on

పిచ్చి అనాలో తెలీదు.. వెర్రి అనాలో తెలీదు. రీల్స్ అనే మాయలో పడి యువత పెడదారి పడుతోంది. లేనిపోని ప్రమాదాలను కొనితెచ్చుకుంది. ఫాలోవర్స్, లైక్స్, వ్యూస్.. టార్గెట్‌గా చాలామంది పిచ్చిపనులకు పూనుకుంటున్నారు. సెన్సార్ లాంటి ఓ కట్టడి లేకపోవడంతో వెర్రితో ఊగిపోతున్నారు. పబ్లిక్ ప్లేసెస్, నిషేధిత స్థలాల్లో కూడా తమ పైత్యం ప్రదర్శిస్తున్నారు. రద్దీ రోడ్లపై కూడా తమ ఆగడాలను ప్రదర్శిస్తూ.. న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇతరులకు మనవళ్ల ఇబ్బంది అవుతందన్న కనీస కామన్‌సెన్స్ వారిలో ఉండటం లేదు. దీంతో ఇలాంటి ఆకతాయిలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు. ఇకపై కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. జన సమ్మర్థ ప్రాంతాల్లో ఎక్స్‌ట్రాలు చేస్తే తోలు తీయబోతున్నారు.  అసౌకర్యం కలిగేలా వీడియోలు షూట్ చేస్తున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన చర్యలకు దిగుతున్నారు.

ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా అకౌంట్​లు చెక్ చేసి పాతవాటిపైనా కేసులు పెడుతున్నారు. ఇటీవల నడిరోడ్డుపై నోట్లు వెదజల్లుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసిన యువకుడిపై ఇప్పటికే కొరడా ఝులిపించి.. కఠిన కేసులు పెట్టి లోపలేశారు.   ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రాంక్‌ వీడియోలు చేయడం వంటివి చేస్తే.. జైలు జీవితం గడపాల్సిందేనట. బైకుతో స్టంట్లు చేయడం, అభ్యంతకరంగా వ్యవహరించడం చేస్తే కేసులు పెట్టడం పక్కానట. పిల్లలు సోషల్​ మీడియాలో ఎలాంటి కంటెంట్‌ చూస్తున్నారో కచ్చితంగా గమనించాలని పోలీసులు అభ్యర్థిస్తున్నారు. వారి సోషల్ మీడియా అకౌంట్లను అప్పుడప్పుడు తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. కేసులు నమోతైతే భవిష్యత్​లో ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి