Hyderabad: నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఈ రూట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్!

ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తూర్పు హైదరాబాద్‌ వాసులకు ఇదో గుడ్‌న్యూస్ చెప్పాలి. ఎందుకంటే తాజాగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమైన మంత్రి కోమటి రెడ్డి ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ ప్రాజెక్టును కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన కేంద్రమంత్రికి వివరించారు.

Hyderabad: నగరంలో 6 కిమీ డబుల్‌ డెక్కర్ కారిడార్‌పై బిగ్‌ అప్‌డేట్.. ఈ రూట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్!
Lb Nagar Hayathnagar Corridor

Updated on: Oct 06, 2026 | 7:45 AM

తెలంగాణకు సంబంధించిన రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహకరించాలని రాష్ట్రరోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. తాజాగా గుజరాత్‌లో ఆయనతో భేటీ అయిన మంత్రి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులు, నిధుల మంజూరు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా తూర్పు హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతిపాదించిన ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణానికి సహకరించాలని కోరారు. సుమారు 6 కిలీ మీటర్ల మేర ఈ కారిడార్ నిర్మించాలనుకుంటున్నామని.. 2026–27 వార్షిక ప్రణాళికలో ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఆర్‌ఈ వాల్‌కు కాకుండా వయాడక్ట్ విధానంలో నిర్మించాలని కేంద్ర మంత్రి వివరించారు మంత్రి కోమటి రెడ్డి. ఫ్యూచర్‌లో జరగబోయే మెట్రో విస్తరణకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలని కోరారు మంత్రి ఈ ప్రాజెక్ట్ పూర్తై అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ తూర్పు ప్రాంతం నుంచి బయటకు వెళ్లే వాహనాల రద్దీ తగ్గుతుందని మంత్రి కోమటి రెడ్డి అన్నారు.

ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్ మార్గం హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లి జాతీయ రహదారికి అటాచ్ అయి ఉందని.. దీంతో ఈ రూట్‌లో వాహనాల రద్దీ ఎక్కవగా ఉండడం కారణంగా ట్రాఫిక్‌ కూడా పెరుగిపోతుందని.. ఆ సమస్య తగ్గి వాహనదారులకు ఇబ్బందులు తొలగాలంటే.. ఈ ఎలివేటెడ్ కారిడా ఎంతో ముఖ్యమని మంత్రి తెలిపారు. ఈ కారిడార్ అందుబాటులోకి వస్తే.. ఈ రూట్‌లో వెళ్లే వాహనాలు నేరుగా పై నుంచి వెళ్లిపోతాయని.. దాని కారణంగా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని వివరించారు. దీని వల్ల నగరంలోకి రాకపోకలు సులభం అవ్వడంతో పాటు ఇందన, రావాణా ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us