ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు మళ్లీ పొడగింపు

| Edited By: Anil kumar poka

Apr 30, 2019 | 7:20 AM

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మళ్లీ పొడిగించింది. దీంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. ఫీజు చెల్లింపునకు మొదట ఈనెల 27వ తేదీ వరకు గడువు విధించిన బోర్డు.. ఆతర్వాత ఈ నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించింది. అయితే ఆదివారం రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ దరఖాస్తునకు ఏర్పాటు చేసిన కౌంటర్లు పనిచేయకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి ఇంటర్ […]

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు మళ్లీ పొడగింపు
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు గడువును తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మళ్లీ పొడిగించింది. దీంతో మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించింది. ఫీజు చెల్లింపునకు మొదట ఈనెల 27వ తేదీ వరకు గడువు విధించిన బోర్డు.. ఆతర్వాత ఈ నెల 29వ తేదీ వరకు గడువును పొడిగించింది. అయితే ఆదివారం రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ దరఖాస్తునకు ఏర్పాటు చేసిన కౌంటర్లు పనిచేయకపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో మరోసారి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువును మే 2వ తేదీ వరకు పొడిగించింది.