మీకు రుణపడి ఉంటా: కేటీఆర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2019 | 10:01 PM

రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 200 పింఛన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 లకు పెంచారని రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీర్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు పింఛన్‌ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. ఎన్నికల సందర్భంగా రూ.2 వేలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేశారన్నారు. అదే విధంగా పింఛన్‌ వయస్సును 57 ఏళ్లకు […]

మీకు రుణపడి ఉంటా: కేటీఆర్
Follow us on

రాష్ట్రంలోని పేద వర్గాల ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 200 పింఛన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1000 లకు పెంచారని రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీర్‌ పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. బీడీ కార్మికులకు పింఛన్‌ కల్పించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని.. ఎన్నికల సందర్భంగా రూ.2 వేలు ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేశారన్నారు. అదే విధంగా పింఛన్‌ వయస్సును 57 ఏళ్లకు తగ్గించడం జరిగిందని.. తద్వారా 7 నుంచి 8 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని వెల్లడించారు.

బీడీ కార్మికులు లక్షన్నర మందికి నెలకు రూ.2వేలు రాబోతున్నాయన్నారు. 17శాతం వృద్ధితో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. పేదల ఇళ్లకు పట్టాలు ఇచ్చి, వారికి లోన్ తీసుకునే సదుపాయం కల్పించామన్నారు. మండేపల్లిలో 1360 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తయ్యాయని ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. త్వరలోనే వాటిని లబ్దిదారులకు అందజేస్తామన్నారు.

3 లక్షల మంది విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పిస్తోందన్నారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించిన రూ.65 కోట్ల చెక్కును త్వరలోనే అందజేస్తామన్నారు. సిరిసిల్లలో కళ్ల ముందే అభివృద్ధి కనిపిస్తుందని, రాష్ట్రం అసూయ పడేట్లు సిరిసిల్ల నియోజకవర్గం తయారైందన్నారు. బతుకమ్మ చీరల బకాయిలు ఏం ఉన్నా తాను అందిస్తానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అప‌రల్ పార్క్‌లో బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. తనకు దేశంలో గుర్తింపు ఉందంటే అది సిరిసిల్లా ప్రజల ఆశీర్వాదంమే అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.