నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్‌ క్లారిటీ.. సీఎం హోదాలో కేటీఆరే అమలు చేసే అవకాశమంటున్న గులాబీ వర్గాలు

|

Jan 28, 2021 | 4:43 PM

తెలంగాణలో నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్‌ తీపివార్త చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు అని..

నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్‌ క్లారిటీ.. సీఎం హోదాలో కేటీఆరే అమలు చేసే అవకాశమంటున్న గులాబీ వర్గాలు
Follow us on

తెలంగాణలో నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్‌ తీపివార్త చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చు అనికేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సమావేశానికి విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. సీఎం కేసీఆర్‌ త్వరలోనే నిరుద్యోగ భృతి ప్రకటించవచ్చన్నారు. ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లుగా తెలిపారు. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

అయితే త్వరలో కేటీఆర్‌ ముఖ్యమంత్రి పీఠం అదిరోహించనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు నేరుగా కేటీఆర్‌కే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిరుద్యోగ భృతి పథకాన్ని సీఎం హోదాలో కేటీఆరే అమలు చేయవచ్చనే చర్చ టీఆర్‌ఎస్‌ వర్గాల్లో వినిపిస్తుంది.