జోరుగా వర్షాలు, పరవళ్లుతొక్కుతున్న కృష్ణమ్మ..!

| Edited By:

Jul 30, 2019 | 7:22 PM

తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. మేడిగడ్డ ప్రస్తుత నీటినిల్వ 7.0 టీఎంసీలుగా ఉంది. దీంతో.. 35 నుంచి 58 గేట్లను అర మీటర్ ఎత్తున ఎత్తి ఉంచారు. 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి ఉధృతంగా […]

జోరుగా వర్షాలు, పరవళ్లుతొక్కుతున్న కృష్ణమ్మ..!
Follow us on

తెలంగాణ ప్రాంతంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో.. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలు కాళేశ్వరం ప్రాజెక్టు జలకళతో కళకళలాడుతోంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. మేడిగడ్డ ప్రస్తుత నీటినిల్వ 7.0 టీఎంసీలుగా ఉంది. దీంతో.. 35 నుంచి 58 గేట్లను అర మీటర్ ఎత్తున ఎత్తి ఉంచారు. 3.50 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

ఇక ములుగు జిల్లా వాజేడు మండలంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదనీటిలో పేరూరు వద్ద 11.30 మీటర్లకు నీటి మట్టం చేరింది. గోదావరి వరద ప్రవాహం 20 సెంటీమీటర్ల చొప్పున పెరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

కాగా.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు జలసిరితో కళకళలాడుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో జలాశయం నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. జూరాల జలాశయానికి కృష్ణా జలాలు చేరుకున్నాయి. కర్నాటకలోని నారాయణపూర్ నుంచి దిగువకు నీరు విడుదల కానున్నాయి. జూరాల ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిలువ 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.512 టీఎంసీలకు చేరింది.