Watch: అర్థరాత్రి భయం.. భయం.. చేతుల్లో కత్తులు.. అంతా ముసుగేసుకున్నారు.. కట్ చేస్తే..

అంతా ముసుగులు వేసుకున్నారు.. చేతుల్లో కత్తులు ఇంకా చాలా మారణాయుధాలు ఉన్నాయి.. అర్థరాత్రి సడెన్ గా కాలనీలోకి ఎంట్రీ ఇచ్చారు.. కట్ చేస్తే.. ఆరు ఇళ్లల్లోని బంగారం, వెంబడి ఆభరణాలు.. సహా నగదు మాయం అయింది.. మారణాయుధాలతో దొంగల బీభత్సం సృష్టించిన ఘటన ఖమ్మం నగరంలోని YSR కాలనీలో చోటుచేసుకుంది.

Watch: అర్థరాత్రి భయం.. భయం.. చేతుల్లో కత్తులు.. అంతా ముసుగేసుకున్నారు.. కట్ చేస్తే..
Robbery Crime News

Updated on: Sep 23, 2025 | 12:58 PM

అంతా ముసుగులు వేసుకున్నారు.. చేతుల్లో కత్తులు ఇంకా చాలా మారణాయుధాలు ఉన్నాయి.. అర్థరాత్రి సడెన్ గా కాలనీలోకి ఎంట్రీ ఇచ్చారు.. కట్ చేస్తే.. ఆరు ఇళ్లల్లోని బంగారం, వెంబడి ఆభరణాలు.. సహా నగదు మాయం అయింది.. మారణాయుధాలతో దొంగల బీభత్సం సృష్టించిన ఘటన ఖమ్మం నగరంలోని YSR కాలనీలో చోటుచేసుకుంది. అర్థరాత్రి వరుసగా ఆరు ఇళ్లలో దొంగలు చోరీ చేశారు. బంగారు ఆభరణాలు, వెండి, నగదును దొంగలు ఎత్తుకెళ్లారు.. పండగకు ఊరెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేసి మరీ దొంగలు చోరీ చేశారు. 8మంది ముఠాగా వచ్చిన దొంగలు.. వరుసగా ఇళ్లల్లో దోపిడికి పాల్పడ్డారు. పోలీస్ కానిస్టేబుల్‌ ఇంట్లోనూ దొంగతనం చేశారు. సీసీ కెమెరాలు, ఇంట్లో మనుషులు ఉన్నా.. సైలెంట్‌గా దోపిడీ చేశారని స్థానికులు తెలిపారు.

కత్తులు పట్టుకుని ముసుగులు ధరించారని.. తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారని స్థానికులు తెలిపారు. అయితే.. చోరీ చేసిన కొన్ని వస్తువులను దొంగలు బయట పడేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.. అయితే.. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు చూసి.. ఖమ్మం నగరం ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నాయి..

వీడియో చూడండి..

ఇవి కూడా చదవండి..

Andhra: అమ్మబాబోయ్.. కొంచెం అయితే గిరినాగు కాటేసేది.. వీడియో చూస్తే ఒళ్లు ఝల్లుమనాల్సిందే..

Viral Video: కొండ చిలువ తిరగబడితే ఎలా ఉంటుందో చూశారా..? ధైర్యముంటేనే వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..