అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ సమర్ధవంతంగా పనిచేయాలి

| Edited By:

Mar 11, 2019 | 11:37 AM

ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసన సభ పక్షం సమావేశం కానుంది. మధ్యాహ్నాం 12 గంటలకు నిర్వహించే ఈ మీటింగ్‌కు ప్రతీ ఎమ్మెల్యే విధిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిన్న సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 16 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని గులాబీ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ దిశగా సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. […]

అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ సమర్ధవంతంగా పనిచేయాలి
Follow us on

ఇవాళ తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ శాసన సభ పక్షం సమావేశం కానుంది. మధ్యాహ్నాం 12 గంటలకు నిర్వహించే ఈ మీటింగ్‌కు ప్రతీ ఎమ్మెల్యే విధిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిన్న సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ఇవాళ్టి ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

16 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించాలని గులాబీ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ దిశగా సన్నాహక సభలు నిర్వహిస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలకు కూడా బాధ్యతలు అప్పగించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ సమర్థవంతంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు సూచించనున్నారు కేసీఆర్.