Kamareddy: మా భూముల్లో పరిశ్రమలు వేసి, మీరు ఇళ్లల్లో పండుగ చేసుకుంటారా.? భోగి రోజు కామారెడ్డి రైతుల వినూత్న నిరసన.

|

Jan 14, 2023 | 12:08 PM

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన విషయం విధితమే. ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్యతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి...

Kamareddy: మా భూముల్లో పరిశ్రమలు వేసి, మీరు ఇళ్లల్లో పండుగ చేసుకుంటారా.? భోగి రోజు కామారెడ్డి రైతుల వినూత్న నిరసన.
Kamareddy
Follow us on

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ను నిరసిస్తూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 5వ తేదీన నిర్వహించిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారిన విషయం విధితమే. ఎల్లారెడ్డికి చెందిన రైతు రాములు ఆత్మహత్యతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. అయితే మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమేనని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. దీంతో ఆందోళనలు వారం రోజులపాటు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే రైతులు తమ నిరసనను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు.

శనివారం భోగి రోజున వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ ఇళ్ల ముందు ముగ్గులు వేశారు. తమ వినతులు ప్రభుత్వానికి తెలిసేలా.. రంగవళ్లులను తీర్చి దిద్దారు. మాస్టార్‌ ప్లాన్‌ రద్దు చేయాలి, అన్నదాత సుఖీభవ, మా భూముల్లో పరిశ్రమలు వేసి మీరేమో ఇండ్లలో పండుగ చేసుకోండి. ఇది మీకు న్యాయమేనా.? అంటూ ముగ్గుల రూపంలో రాసి తమ నిరసనను తెలిపారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ రైతులు కొన్ని నెలలుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. 49మంది కౌన్సిలర్లకు రైతులు వినతి పత్రాలు ఇచ్చారు. అంతే కాకుండా మున్సిపల్ కార్యాలయాన్ని, కలెక్టర్ ఆఫీస్‌ను కూడా ముట్టడించారు. ప్రస్తుతం ఈ అంశంపై కోర్టులో కూడా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఇలా ముగ్గులతో నిరసన తెలియజేశారు. ఇక సంక్రాంతి రోజు కూడా ఇదే విధంగా నిరసనల తెలుపాతమని గతంలోనే రైతు జేఏసీ ప్రకటించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..