Heart attack: గుండెపోటుతో చికిత్స కోసం వెళ్లిన బాధితుడు.. వైద్యం చేస్తూ డాక్టర్.. ఇద్దరూ ఒకేసారి..

|

Nov 28, 2021 | 12:48 PM

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అత్యంత హృదయ విదారక ఘటన.. హార్ట్‌ స్ట్రోక్‌తో వచ్చిన పేషెంట్‌కు ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన డాక్టర్‌ కూడా అదే తరహాలో..

Heart attack: గుండెపోటుతో చికిత్స కోసం వెళ్లిన బాధితుడు.. వైద్యం చేస్తూ డాక్టర్.. ఇద్దరూ ఒకేసారి..
Dr. Lakshman
Follow us on

Heart attack: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అత్యంత హృదయ విదారక ఘటన.. హార్ట్‌ స్ట్రోక్‌తో వచ్చిన పేషెంట్‌కు ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన డాక్టర్‌ కూడా అదే తరహాలో ప్రాణాలొదిలారు. పేషెంట్‌కు ట్రీట్‌మెంట్‌ చేస్తుండగా డాక్టర్‌కు కూడా గుండెపోటు రావడంతో ఇద్దరూ మృతి చెందారు.  ఇది విన్నవారంతా షాక్ అవుతున్నారు. గాంధారి మండలం గుజ్జల్‌ తండాకు చెందిన ఓ వ్యక్తికి హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో.. స్థానికంగా ఉన్న నర్సింగ్‌ హోమ్‌కు తరలించారు. అయితే అతనికి ట్రీట్‌మెంట్‌ చేస్తున్న సమయంలోనే డాక్టర్‌ లక్ష్మణ్‌కు కూడా హార్ట్‌ అటాక్‌ వచ్చింది. దీంతో స్పాట్‌లోనే డాక్టర్ లక్ష్మణ్ మృతి చెందారు.

అయితే.. వెంటనే పేషెంట్‌ను కామారెడ్డి ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు అతని బంధువులు. కానీ ఈలోపే మార్గమధ్యలోనే ఆ పేషెంట్‌ కూడా మృతి చెందాడు. అటు పేషెంట్‌కు ప్రాణం పోసేందుకు ప్రయత్నించిన డాక్టర్‌.. ఇటు పేషెంట్‌ ఇద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. ఇదంతా క్షణాల్లోనే జరిగిపోయింది.

యువకుడైన డాక్టర్ లక్ష్మణ్‌కు గుండెపోటు వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున ఆతని ఆస్పత్రికి కామారెడ్డి వాసులు ఆస్పత్రికి క్యూ కట్టారు. ఎంతో ఆరోగ్యంగా ఉండే డాక్టర్ ఇలా చనిపోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: ఇలాంటివారితో చాలా జాగ్రత్తగా మాట్లాడండి.. చాణక్యనీతిలో సంచలన విషయాలు..

Black Friday Sale: బ్లాక్ ఫ్రైడే సేల్ అంటే తెలుసా.. ఇది ఎక్కడ ప్రారంభమైంది.. భారతదేశంలో ఎప్పుడు వచ్చింది..