ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ ట్రైన్ టైమింగ్స్‌ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం!

హైదరాబాద్‌లోని కాచీగూడ, అశోకాపురం మద్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. 12785 , 12786 నెంబర్‌గల కాచిగూడ – అశోకాపురం – కాచిగూడ డైలీ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు, మార్గమధ్య సమయాల్లో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేసింది.

ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ఈ ట్రైన్ టైమింగ్స్‌ విషయంలో రైల్వేశాఖ కీలక నిర్ణయం!
Kacheguda Ashokapuram Express

Updated on: Aug 26, 2026 | 5:38 PM

హైదరాబాద్, ఆగస్ట్ 26: తెలుగురాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. హైదరాబాద్‌లోని కాచిగూడ – అశోకాపురం మధ్య రాకపోకలు సాగించే 12785, 12786 నెంబర్‌గల డైలీ ఎక్స్‌ప్రెస్ రన్నింగ్ టైమింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదని స్పష్టం చేసింది. గతంలో ఈ రైలు ప్రయాణ వేగాన్ని పెంచుతూ, ఆగస్టు 25 నుంచి కాచిగూడ నుండి, ఆగస్టు 26 నుంచి అశోకాపురం నుండి కొత్త సమయాలను అమలు చేయాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. అయితే, నిర్వహణాపరమైన కారణాల వల్ల ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న పాత సమయాలే యథావిధిగా ఈ రైళ్ల రాకపోకలు కొనసాగుతాయని స్పస్టం చేశారు.

రైలు రాకపోకల వివరాలు

12785 రైలు నెంబర్ కాచిగూడ – అశోకాపురం డైలీ ఎక్స్‌ ప్రెస్ రైలు ప్రతిరోజూ రాత్రి 07:05 గంటలకు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:55 గంటలకు అశోకాపురం చేరుకుంటుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. అలాగే 12786 నెంబర్ గల అశోకాపురం – కాచిగూడ డైలీ ఎక్స్‌ప్రెస్ ప్రతిరోజూ మధ్యాహ్నం 02:55 గంటలకు అశోకాపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:40 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపింది.

రైలు ప్రయాణ సమయాలు, ఇతర సమాచారం కోసం ప్రయాణికులు నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (NTES) వెబ్‌సైట్  https://enquiry.indianrail.gov.in/mntes/ లేదా ‘రైల్ వన్’ యాప్‌ను చూడాలని రైల్వే అధికారులు సూచించారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us