నల్లమల పై జెట్ ఫోకస్.. ఏం జరుగుతోంది..?

| Edited By:

Oct 16, 2019 | 9:40 AM

నల్లమల వివాదం మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిలో మంగళవారం జెట్ విమానం సంచరించింది. ఆకాశంలో వెళ్తున్న జెట్ విమానం ఆకస్మాత్తుగా ఒకేసారి భూమికి చాలా దగ్గరకు వచ్చి తిరిగి పైకి వెళ్లడం […]

నల్లమల పై జెట్ ఫోకస్.. ఏం జరుగుతోంది..?
Follow us on

నల్లమల వివాదం మళ్లీ తెరపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. నల్లమల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం జెట్ విమానం ఆకాశంలో చక్కర్లు కొట్టడంతో గిరిజనులు ఆందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు, సంభాపురం, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని సార్లపల్లి, పెట్రాల్ చేను గ్రామాల పరిధిలో మంగళవారం జెట్ విమానం సంచరించింది. ఆకాశంలో వెళ్తున్న జెట్ విమానం ఆకస్మాత్తుగా ఒకేసారి భూమికి చాలా దగ్గరకు వచ్చి తిరిగి పైకి వెళ్లడం గిరిజనులను ఆందోళనకు గురిచేసింది. అయితే విమానం చక్కర్లు కొట్టిన గ్రామాలు, ప్రాంతాలన్నీ యురేనియం నిక్షేపాలున్న ప్రదేశంగా అధికారులు గతంలో గుర్తించినవి కావడం గమనార్హం. అలాగే నెల రోజుల క్రితం కూడా ఓ విమానం ఈ ప్రాంతంలో తిరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియంపై ఎటువంటి సర్వేలు లేవని ప్రకటిస్తుండగా, ఈ విధంగా హెలికాప్టర్లు ఆకాశంలో చక్కర్లు కొట్టడం చూస్తుంటే.. యురేనియం వెలికితీతకు ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుందేమోనని గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.