Telangana: మామూలోడు కాదు.. అత్యాశకు పోతే ఉన్నదంతా ఊడ్చేశాడు.. మ్యాటర్ ఏంటంటే..

| Edited By: Shaik Madar Saheb

Aug 08, 2024 | 11:24 AM

గ్రామీణ ప్రాంతాల ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు కేటుగాళ్లు.. వందల వడ్డీ చూపించి కోట్లను కొల్లగోడుతున్నారు వడ్డీ వ్యాపారులు.. మొదట వడ్డీ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. తర్వాత పెద్ద మొత్తంలో వసూలు చేసి అడ్రస్ లేకుండా చెక్కేస్తున్నారు. ఒకరిని నమ్మి ఒకరు ఇలా లక్షల రూపాయలు వడ్డీ వ్యాపారులకిచ్చి లబోదిబోమంటున్నారు బాధితులు.

Telangana: మామూలోడు కాదు.. అత్యాశకు పోతే ఉన్నదంతా ఊడ్చేశాడు.. మ్యాటర్ ఏంటంటే..
Crime News
Follow us on

గ్రామీణ ప్రాంతాల ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు కేటుగాళ్లు.. వందల వడ్డీ చూపించి కోట్లను కొల్లగోడుతున్నారు వడ్డీ వ్యాపారులు.. మొదట వడ్డీ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. తర్వాత పెద్ద మొత్తంలో వసూలు చేసి అడ్రస్ లేకుండా చెక్కేస్తున్నారు. ఒకరిని నమ్మి ఒకరు ఇలా లక్షల రూపాయలు వడ్డీ వ్యాపారులకిచ్చి లబోదిబోమంటున్నారు బాధితులు. నాగర్ కర్నూల్ జిల్లాలో వరుస వడ్డీ వ్యాపారుల అక్రమాల ఘటనలు కలకలం రేపుతున్నాయి.. కందనూలులో అధిక వడ్డీ పేరుతో అర్థిక నేరాలు పెచ్చుమీరుతున్నాయి. జిల్లాలో రోజుకోచోట వడ్డీ వ్యాపారుల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న రేవల్లి మండలం నాగపూర్ వడ్డీ వ్యాపారి సాయిబాబా ఘరానా మోసం మరువక ముందే.. తెలకపల్లి మండలంలో మరో ఉదంతం వెలుగు చూసింది. అధిక వడ్డీ ఆశకు వెళ్లి.. ఉన్నదంతా పోగోట్టుకుంటున్నారు నాగర్ కర్నూల్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు..

నడిగడ్డ గ్రామానికి చెందిన జహిర్ చోటేమియా అధిక వడ్డీ ఆశ చూపి సొంత మండలంలోని గ్రామాలతోపాటు నాగర్ కర్నూల్‌లోని సుమారు 200మంది వద్ద వసూలు చేసి నెత్తిపై కుచ్చుటోపి పెట్టి పరారయ్యాడు. సమీప బంధువులను ఆసరాగా చేసుకోని సుమారు రూ.20 కోట్ల మేర వసూలు చేశాడు చోటేమియా. మొదట 2, 3, 5 లక్షల వరకు నిందితుడి దగ్గర దాచుకోని ఒకేసారి వడ్డీతో సహా తీసుకొని వెళ్లేవారు. ఇలాగే అందరినీ నమ్మించడంతో ఒక్కొక్కరు రూ.5 లక్షలు రూ.10 లక్షల వరకు చోటేమియాకు ఇచ్చారు. కొంత కాలంపాటు మిత్తితో పాటు కొంత అసలు కూడా ఇచ్చిన చోటేమియా ఆ తర్వాత అసలు కథ మొదలెట్టాడు. గత ఆరు నెలల నుండి అసలు కాదు కదా మిత్తి డబ్బులు కూడా ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ విషయంలో బాధితులు పెద్దమనుషుల సమక్షంలో కూడా పంచాయతీ పెట్టారు. ఒకరిద్దరి బాధితులకు కొంత డబ్బులు చెల్లించి సెటిల్మెంట్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ముఖం చాటేశాడు. ఏం చేస్తారో చేసుకోమంటూ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు.

పోలీసులను ఆశ్రయించిన బాధితులు:

అయితే జహిర్ చోటేమియా కనిపించకుండా పోవడంతో బాధితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.. గత్యంతరం లేక లబోదిబోమంటూ నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీని కలిసి పరిస్థితి విన్నవించుకున్నారు. న్యాయం చేయాలంటూ మొరపెట్టుకున్నారు. కాయకష్టం చేసి దాచుకున్న డబ్బులు అధిక వడ్డీ ఆశపడి చోటేమియాకు ఇచ్చామని… తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.

ఇలా.. అధికవడ్డీలకు ఆశపడి… ఉన్న అసలు నగదును పోగోట్టుకుంటున్నారు నాగర్ కర్నూలు జిల్లా ప్రజలు. పుట్టగోడుగుల్లా పుట్టుకొస్తూ గ్రామాల్లో అమాయక ప్రజల సొమ్మును కాజేస్తున్న వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..