వివాహేతర సంబంధం.. భర్తను చితకొట్టిన భార్య

| Edited By: Ravi Kiran

Jul 25, 2019 | 6:30 PM

తనను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ భర్త. ఈ విషయం తెలుసుకొని అతడికి విడాకులు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనను అతడి ముందు కూడా పెట్టింది. అయితే అతడు దాన్ని పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ.. తన బంధువుల సాయంతో భర్తను, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉతికి ఆరేసింది. ఈ సంఘటన కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మణ్‌కు, సౌజన్యతో కొన్ని సంవత్సరాల క్రితం […]

వివాహేతర సంబంధం.. భర్తను చితకొట్టిన భార్య
Follow us on

తనను వదిలేసి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు ఓ భర్త. ఈ విషయం తెలుసుకొని అతడికి విడాకులు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ ప్రతిపాదనను అతడి ముందు కూడా పెట్టింది. అయితే అతడు దాన్ని పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆ మహిళ.. తన బంధువుల సాయంతో భర్తను, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను ఉతికి ఆరేసింది. ఈ సంఘటన కూకట్‌పల్లిలోని ప్రగతినగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మణ్‌కు, సౌజన్యతో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరిద్దరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా లక్ష్మణ్ కరీంనగర్ జిల్లా వెంకట్రావుపేటకు చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో అప్పటినుంచి సౌజన్యకు దూరంగా ఉంటున్న లక్ష్మణ్.. ఆమె విడాకులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. అంతేకాదు ఆమెను రెచ్చగొట్టేలా ఆ మహిళతో తాను తీసుకున్న ఫొటోలను లక్ష్మణ్ సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించారు. దీంతో సహనం కోల్పోయిన సౌజన్య.. తన బంధువులను తీసుకొచ్చి లక్ష్మణ్ తాట తీసింది. ఆ తరువాత వీరిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. తనకు న్యాయం చేయాలని వారిని కోరింది.