ముగిసిన డెడ్‌లైన్.. తగ్గని కార్మికులు.. నెక్ట్స్‌ స్టెప్‌కు కేసీఆర్ రెడీ..?

| Edited By: Srinu

Nov 06, 2019 | 5:39 PM

ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరాలని.. లేని పక్షంలో మిగతా 5వేల రూట్లను కూడా ప్రైవేటీకరణ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను కార్మికులు పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కేవలం 373 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు చేరవేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కార్మికులు […]

ముగిసిన డెడ్‌లైన్.. తగ్గని కార్మికులు.. నెక్ట్స్‌ స్టెప్‌కు కేసీఆర్ రెడీ..?
Follow us on

ఆర్టీసీ సమ్మె విషయంలో కార్మికులకు సీఎం కేసీఆర్ డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే. నవంబర్ 5 అర్ధరాత్రి లోపు కార్మికులు విధుల్లో చేరాలని.. లేని పక్షంలో మిగతా 5వేల రూట్లను కూడా ప్రైవేటీకరణ చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. అయితే ఈ వ్యాఖ్యలను కార్మికులు పెద్దగా పట్టించుకోలేదు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల వరకు కేవలం 373 మంది కార్మికులు మాత్రమే విధుల్లో చేరారు. దీనికి సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు చేరవేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కార్మికులు వెనక్కి తగ్గకపోవడంతో.. కేసీఆర్ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తులను కూడా ప్రభుత్వం ప్రారంభించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా రాకపోతే సుప్రీంకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు కూడా సమాచారం. ఇక దీనిపై కేసీఆర్ ఇవాళ అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆర్టీసీ విలీనంపై ఆయన ఇవాళ కీలక ప్రకటన ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

కాగా తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు సమ్మె విరమించమని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో కేంద్రానికి 30 శాతం వాటా ఉందని, అందులో ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతి ఉండాలని  ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రోజుకోసారి ఆర్టీసీని ప్రైవేటీకరిస్తాం.. రూట్లు అమ్మేస్తాం.. అనడం ముఖ్యమంత్రికి సరికాదని.. ఆర్టీసీని తీసేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి ఉండాలి’’ అని తెలిపారు. ఆర్టీసీ కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదని అశ్వత్థామ రెడ్డి భరోసా కల్పించారు. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 33వ రోజు కొనసాగుతోంది. నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. దీంతో డిపోల దగ్గర భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.