Vegetable Prices Today: పండుగ షాపింగ్‌కు వెళ్తున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఇవే.. ఏవేవి ఎంత ఉన్నాయంటే..?

దీపావళి పండక్కి కోసం ఇంట్లో కూరగాయలు కొనేందుకు వెళ్తున్నారా.. అయితే వెళ్లేముందు ఒకసారి కూరగాయల ధరల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని వల్ల ఇంటి బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వెజిటెబుల్ ధరలు పడిపోయాయి. పండక్కి ముందు ఇది ఉపశమనంగా చెప్పవచ్చు.

Vegetable Prices Today: పండుగ షాపింగ్‌కు వెళ్తున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఇవే.. ఏవేవి ఎంత ఉన్నాయంటే..?
Vegetable Prices

Updated on: Nov 05, 2026 | 11:29 AM

దీపావళి పండుగ మరో రెండ్రోజులు మాత్రమే ఉండటంతో ప్రజలు షాపింగ్‌ బాట పట్టారు. పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఇంట్లోకి కావాల్సిన నిత్యవసర సరుకులు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో కిరాణా సరుకులతో పాటు ఇంట్లోకి వంటకు కావాల్సిన కూరగాయలు కూడా తెచ్చి పెట్టుకుంటున్నారు. పండక్కి మందే ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ సిద్దం చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా రైతు బజార్లలో కస్టమర్ల సంఖ్య పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు, కూరగాయల షాపులు కస్టమర్లతో కిటకిలాడుతున్నాయి. అయితే పండక్కి కూరగాయలు తెచ్చుకునేవారు ధరల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని వల్ల ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకోవచ్చు. గతంలో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని కూరగాయలు చవక ధరకే లభిస్తున్నాయి. నవంబర్ 5న తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లోని రైతు బజార్లలో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో గురువారం కూరగాయల ధరలు..

కూకట్‌పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో నవంబర్ 5న కిలో టమాట రూ.23, వంకాయ రూ.18, బెండకాయ రూ.38, బజ్జి మిర్చి రూ.55, పచ్చిమిర్చి రూ.40, కాకరకాయ రూ.31, బీరకాయ రూ.28, క్యాబేజి రూ.11, బీన్స్ రూ.50, క్యారెట్ రూ.40, గోబిపువ్వు రూ.25, దొండకాయ రూ.22, చిక్కుడుకాయ రూ.28, గోరుచక్కుడు రూ.28, బీట్ రూట్ రూ.19, క్యాప్సికం రూ. 45, ఆలుగడ్డ రూ.17, దోసకాయ రూ.19, ఉల్లిగడ్డ రూ. 40 పలుకుతున్నాయి. ఇక కీరా లోకల్ రూ. 18, ఇటాలియన్ కీరా రూ. 35,అరటికాయ ఒక్కొక్కటి రూ. 9 నుండి 10, ముల్లంగి ఒక్కొక్కటి రూ. 6 నుండి 8, మామిడికాయ ఒక్కొక్కటి రూ. 15 నుండి 20కి విక్రయిస్తున్నారు. ఎండు మిర్చి కిలో రూ.280, వెల్లుల్లి రూ. 260, పాత అల్లం రూ. 180, కొత్త అల్లం రూ. 120,చింతపండు రూ.160గా ఉన్నాయి. నిమ్మకాయలు డజను రూ. 50 నుండి 60, పండు మిర్చి రూ. 80, కరివేపాకు రూ. 80, పల్లీకాయ రూ.55, కాకరకాయ రూ. 85, పుట్టగొడుగులు 200 గ్రాములకు రూ. 50 చొప్పున ఉన్నాయి.

విజయవాడలో నేటి కూరగాయల ధరలు..

విజయవాడలోని రైతు బజార్లలో కిలో టామాట రూ.40, వంగ రూ.23, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.34, కాకర రూ.32, క్యాబేజీ రూ.24, క్యారెట్ రూ.45, దొండ రూ.22, బంగాళదుంప రూ.26, ఉల్లిపాయలు రూ.40, గోరుచిక్కుడు రూ.32, దోస రూ.22, సొర రూ.10,12, అరటి కాయ రూ.7,6, చిక్కుళ్లు రూ.56, బీర రూ.36, చామదుంప రూ.34, కంద రూ.34, బీట్ రూట్ రూ.36, కీరదోస రూ.46, బీన్స్ రూ,.105, క్యాప్చికం రూ.60, అలసందలు రూ.40, చిలకడదుంప రూ.46గా కొనసాగుతున్నాయి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us