ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ పోలీసులపై మహిళల ఫైర్!

| Edited By:

Dec 02, 2019 | 11:53 PM

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో 26 ఏళ్ల దిశ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. మరోవైపు నగరంలో మహిళల భద్రతపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా హైదరాబాద్ పోలీసులు ప్రయాణించేటప్పుడు ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై 14 అంశాలతో సలహాలు ఇచ్చారు. “మహిళలు మరియు బాలికలందరికీ చాలా ముఖ్యమైన సందేశం” అనే పేరుతో పోలీసు కమిషనర్ అంజని కుమార్ విడుదల చేశారు. దీనిలో  మహిళలు అనుసరించాల్సిన చర్యలను సూచించారు. మహిళలు వారి ప్రయాణం […]

ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ పోలీసులపై మహిళల ఫైర్!
Follow us on

హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో 26 ఏళ్ల దిశ సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్లమెంటులో కూడా దీనిపై చర్చ జరిగింది. మరోవైపు నగరంలో మహిళల భద్రతపై అడిగిన ప్రశ్నలకు సమాధానంగా హైదరాబాద్ పోలీసులు ప్రయాణించేటప్పుడు ఎలా సురక్షితంగా ఉండాలనే దానిపై 14 అంశాలతో సలహాలు ఇచ్చారు.

“మహిళలు మరియు బాలికలందరికీ చాలా ముఖ్యమైన సందేశం” అనే పేరుతో పోలీసు కమిషనర్ అంజని కుమార్ విడుదల చేశారు. దీనిలో  మహిళలు అనుసరించాల్సిన చర్యలను సూచించారు. మహిళలు వారి ప్రయాణం గురించి వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పమని సలహా ఇచ్చారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు కుటుంబ సభ్యులకు వాహన నంబర్‌ను తెలియచేయాలని సూచించారు. రద్దీ ప్రదేశాలలో వేచి ఉండండని తెలిపారు. సహాయం కోసం ఆ ప్రాంతంలోని పోలీసు పెట్రోలింగ్ ను సంప్రదించాలని, పబ్లిక్ లేని చోట ఒంటరిగా ఉన్నప్పుడు, షాపులు వంటి సమీప వాణిజ్య ప్రదేశాలకు వెళ్లడానికి ప్రయత్నించండని వివరించారు. 100 డయల్ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని, హాక్ ఐ తెలంగాణ పోలీస్ మొబైల్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. మీరు నిస్సహాయ పరిస్థితిలో ఉంటే, దయచేసి అరవండి, రద్దీ ఉన్న ప్రాంతం వైపు పరుగెత్తండని సూచించారు. అయితే మహిళలు వీటిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

[svt-event date=”02/12/2019,11:24PM” class=”svt-cd-green” ]

[svt-event date=”02/12/2019,11:25PM” class=”svt-cd-green” ]

[svt-event date=”02/12/2019,11:25PM” class=”svt-cd-green” ]