సంపాదించే ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత పొదుపు చేయాలని భావిస్తుంటారు. దీంతో డబ్బును వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాటిలో రియల్ ఎస్టేట్ మొదటి వరుసలో ఉంటుంది. సరైన టైంలో సరైన ప్లేస్‌లో ప్రాపర్టీ కొంటే మనం ఊహించనంత మలుపు తిరుగుతుంది జీవితం. అందుకే మనలో చాలా మంది ఇల్లు, స్థలం, అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్, ఇంకా లగ్జరీ ప్రాపర్టీ కావాలనుకునే వాళ్లు విల్లా, ఫార్మ్ హౌస్ ఇంకా ఫార్మ్ లాండ్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాపర్టీ .. ఇలా ఏదో ఒకదానిలో ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో ఉంటారు. కానీ మన బడ్జెట్‌లో ఏ ఏ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి వాటి మార్కెట్ రేట్ ఏంటి తెలుసుకోవడానికి చాలా రియల్ ఎస్టేట్ కంపనీలను కలవాలి, తిరగాలి, చాలా చోట్ల మార్కెట్ ధరలను పరిశీలించాలి, ఇలాంటి వారి కోసమే TV9 తెలుగు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. TV9 SweetHome Real Estate Expo ఇక్కడ ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ కంపనీలు ఎన్నో తమ ప్రతిష్టాత్మక ప్రొజెక్టులను ప్రదర్శించబోతున్నాయి.. రియల్ ఎస్టేట్ రంగంలో ఏ ఏ ప్రాంతాల్లో ధరలు పెరుగే అవకాశాలున్నాయి, ప్రస్తుత ధరలు, మార్కెట్ పరిస్తితుల గురించి తెలుసుకోవడం వల్ల ప్రాపర్టీ కొనే సమయంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది..
మూడు రోజులపాటు జరగనున్న ఈ TV9 SweetHome Real Estate Expo కార్యక్రమంలో ప్రజలు తమ అవసరాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా తనకు నచ్చిన ప్రాపర్టీ ఆప్షన్‌ను ఎంచుకోవడంతో పాటు.. ప్రాపర్టీ లోన్ పొందే అవకాశాల గురించి కూడా తెలుసుకోవచ్చు.. ఈ నెల 22, 23, 24 తేదీలలో హైటెక్ సిటీలోని మేదాన్ ఎక్స్‌పో సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి అందరూ అహ్వానితులే. ప్రవేశం ఉచితం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..