Telangana: నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో.. ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాని, సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు మారాయ్. కేవలం కొన్ని చోట్ల, పరిమితమైన చోట్ల మాత్రమే త్రిముఖ పోటీ కనిపించింది. మెజారిటీ ఫలితాలు వన్ టు వన్ కనిపించాయి. పోటీ మొత్తం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే కనిపించింది. అయితే.. చాలా చోట్ల ఏకపక్ష ఫలితాలు వచ్చాయి.

Telangana: నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
15

Updated on: Feb 13, 2026 | 10:03 PM

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపించింది. పట్టణాల్లో హస్తం పార్టీ పాగా వేసింది. కాంగ్రెస్ నేతల మాటల ప్రకారం.. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నట్టే లెక్క. పైగా ప్రచారంలో అన్నీ తానై రేవంత్ రెడ్డి ప్రదర్శించిన దూకుడు కూడా పనిచేసినట్టుగా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు నుంచే సీఎం రేవంత్ రెడ్డి వేసుకున్న వ్యూహాలు, బలగాలను మోహరించిన తీరుకు మార్కులు పడ్డాయి. ఒకరకంగా ఒంటిచేత్తో ఫలితాలను రాబట్టారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాంగ్రెస్‌కు బలం అని, పట్టణ ప్రాంతాలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బీఆర్ఎస్ బలం చూపుతుందని, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు గెలిచిన చోట కమలం వికసిస్తుందని ఓ అంచనా ఉండేది. కాని, ఓవరాల్ మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీనే సత్తా చాటింది. అది క్లియర్‌గా కనిపించింది కూడా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన ఈ మున్సిపల్ ఎన్నికల్లో.. ఈసారి త్రిముఖ పోటీ ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాని, సీఎం రేవంత్ రెడ్డి అంచనాలు మారాయ్. కేవలం కొన్ని చోట్ల, పరిమితమైన చోట్ల మాత్రమే త్రిముఖ పోటీ కనిపించింది. మెజారిటీ ఫలితాలు వన్ టు వన్ కనిపించాయి. పోటీ మొత్తం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి