లష్కర్ బోనాల్లో.. డ్యాన్స్‌తో ఇరగదీసిన తలసాని

| Edited By:

Jul 23, 2019 | 5:30 PM

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బోనాలు పండుగలో స్టెప్పులు ఇరగదీశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ.. బోనాల పండుగను ఆషాఢమాసంలో నెలరోజుల పాటు నిర్వహిస్తారు. ఒక్కో వారంలో.. ఒక్కో అమ్మవారి ఆలయంలో బోనాల పండగ చేస్తారు. ఈ పండుగను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా.. అమ్మవార్లకు బోనాలు సమర్పించడం, యాటలు కోయడం, పోతురాజుల విన్యాసాలు, చిన్నా పెద్దా చిందులేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర […]

లష్కర్ బోనాల్లో.. డ్యాన్స్‌తో ఇరగదీసిన తలసాని
Follow us on

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. బోనాలు పండుగలో స్టెప్పులు ఇరగదీశారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ.. బోనాల పండుగను ఆషాఢమాసంలో నెలరోజుల పాటు నిర్వహిస్తారు. ఒక్కో వారంలో.. ఒక్కో అమ్మవారి ఆలయంలో బోనాల పండగ చేస్తారు. ఈ పండుగను కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్నారు.

ఈ ఉత్సవంలో భాగంగా.. అమ్మవార్లకు బోనాలు సమర్పించడం, యాటలు కోయడం, పోతురాజుల విన్యాసాలు, చిన్నా పెద్దా చిందులేయడం ఆనవాయితీగా వస్తోంది. కాగా.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా.. ఆదయ్య నగర్‌లో ఏర్పాటు చేసిన పలహారపు బండి ఊరేగింపు కార్యక్రమంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. డ్యాన్స్‌ చేసి.. అదుర్స్ అనిపించారు. డప్పుచప్పులకు అనుగుణంగా.. ఒక్కో స్టెప్‌ వేస్తూ.. అక్కడున్న యూత్‌కి ఉత్సాహన్ని నింపారు. మంత్రి స్టెప్పులేయడంతో.. అక్కడున్న వారంతా ఒక్కసారిగా కేరింతలు కొడుతూ.. ఆయన డ్యాన్స్‌ను కెమెరాల్లో బంధించారు.