సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు.. ఎవరు గెలుస్తారో..!

| Edited By:

Oct 10, 2019 | 11:03 AM

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. కొన్ని చోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగుతున్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణకు వచ్చే వారికి కూడా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కాగా మరోవైపు ఆర్టీసీ సమ్మెపై దాఖలైన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సమ్మె చట్టబద్ధం కాదని అటు ప్రభుత్వం.. తమ డిమాండ్ల సాధనకే సమ్మె అంటూ ఇటు కార్మికులు వాదిస్తున్న […]

సమ్మెపై నేడు హైకోర్టు తీర్పు.. ఎవరు గెలుస్తారో..!
Follow us on

తెలంగాణాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు కొనసాగుతోంది. కొన్ని చోట్ల బంద్ ప్రభావం పాక్షికంగా కొనసాగుతున్నప్పటికీ.. మరికొన్ని ప్రదేశాల్లో డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా.. తెలంగాణకు వచ్చే వారికి కూడా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. కాగా మరోవైపు ఆర్టీసీ సమ్మెపై దాఖలైన హౌస్‌ మోషన్ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. సమ్మె చట్టబద్ధం కాదని అటు ప్రభుత్వం.. తమ డిమాండ్ల సాధనకే సమ్మె అంటూ ఇటు కార్మికులు వాదిస్తున్న నేపథ్యంలో ఇవాళ న్యాయస్థానం ఇచ్చే తీర్పు కీలకంగా మారింది.

దసరా పండుగ వేళ ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సమ్మెను విరమించేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో అన్ని ఆర్టీసీ డిపోల వద్ద వాస్తవ పరిస్థితులపై ఈ నెల 10న నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ నివేదికను ఇవాళ ప్రభుత్వం కోర్టుకు అందజేయనుంది. మరోవైపు సమ్మెపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశిస్తూనే.. సమ్మెపై వివరణ ఇవ్వాలని రెండు ఆర్టీసీ ఉద్యోగుల గుర్తింపు సంఘాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి పూర్తి వాదనలు జరిగాక, తుది తీర్పు వెలువడనుంది.

కాగా సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాలని.. వారి స్థానంలో వీలైనంత త్వరగా కొత్త నియామకాలు జరగాలని సీఎం కేసీఆర్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయినా కార్మికులు వెనక్కి తగ్గడం లేదు. తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె విరమించమని వారు గట్టిగా కూర్చుకున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు చెప్పే తీర్పు ఎవరికి అనుగుణంగా వస్తుందన్న ఉత్కంఠ అందరిలో కొనసాగుతోంది.