మేడారంలో కేసీఆర్.. కొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం

| Edited By: Srinu

Feb 07, 2020 | 6:01 PM

పర్యటనలో భాగంగా.. మేడారంలోని సమక్క-సారక్క వన దేవతలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు.  తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు కేసీఆర్‌కు దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గద్దె మీదున్న సమ్మక్కకు చీరెను సారిగా పెట్టారు. బెళ్లాన్ని ప్రసాదంగా నివేదించారు. కాసేపటి క్రితమే హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం […]

మేడారంలో కేసీఆర్.. కొత్త సంప్రదాయానికి తెర తీసిన సీఎం
Follow us on

పర్యటనలో భాగంగా.. మేడారంలోని సమక్క-సారక్క వన దేవతలను కుటుంబసమేతంగా దర్శించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన కొత్త సంప్రదాయానికి తెర తీశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వనదేవతలకు పట్టువస్త్రాలు సమర్పించారు.  తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రెడ్డిలు కేసీఆర్‌కు దగ్గరుండి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేసీఆర్ గద్దె మీదున్న సమ్మక్కకు చీరెను సారిగా పెట్టారు. బెళ్లాన్ని ప్రసాదంగా నివేదించారు. కాసేపటి క్రితమే హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం గవర్నర్ తమిళిసై సమ్మక్కను దర్శించుకున్నారు. కాగా.. రేపు వనప్రవేశం చేయనున్నారు గిరిజన దేవతలు.

గురువారం సమ్మక్క గద్దె చేరుకున్న సందర్భంగా.. మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఈ రోజు భక్తులు భారీ స్థాయిలో వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. బెల్లంను నిలువెత్తు బంగారంలా సమర్పిస్తున్నారు. రెండేళ్లకోసారి మేడారం జాతర జరగడంతో.. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు.