ఏడేళ్ల బాలుడు కిడ్నాప్.. నిందితుడు ఎవరంటే?

| Edited By:

Nov 19, 2019 | 3:04 PM

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్ ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకెళితే… రాజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్‌పేటలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అర్జున్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. పిల్లాడు ఏమైపోయాడోనని […]

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్.. నిందితుడు ఎవరంటే?
Follow us on

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు. అనంతరం కిడ్నాపర్ ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు డిమాండ్ చేశాడు. అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకెళితే… రాజ్‌కుమార్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ భార్య, కొడుకు అర్జున్(7)తో కలిసి మీర్‌పేటలోని టీఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అర్జున్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. పిల్లాడు ఏమైపోయాడోనని తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించడం మొదలుపెట్టారు. కాసేపటి తర్వాత రాజ్‌కుమార్ కు  ఓ నంబర్‌ను నుంచి ఫోన్ వచ్చింది. ‘మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాం. రూ.3లక్షలిస్తేనే వదిలిపెడతాం’ అంటూ అవతలి వ్యక్తి చెప్పి కాల్ కట్ చేశాడు.

దీంతో ఆందోళనపడిన రాజ్‌కుమార్ వెంటనే మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈలోగా ఆ కిడ్నాపర్ పదేపదే రాజ్‌కుమార్‌కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేయసాగాడు. దీంతో పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా కిడ్నాపర్ ఉన్న లొకేషన్ గుర్తుపట్టి అక్కడికి చేరుకున్నారు. ఆ కిడ్నాపర్‌ని చూశాక ఒక్కసారిగా  అంతా షాకయ్యారు. కారణం.. నిందితుడు ఏ కరడుగట్టిన నేరస్థుడో కాదు… పదో తరగతి చదువుతున్న 14ఏళ్ల బాలుడు. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడిని పట్టుకుని జీపులో ఎక్కించారు. అర్జున్‌ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.