హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టురట్టు

|

Apr 10, 2019 | 7:43 PM

హైదరాబాద్: రాజధానిలోని బేగంబజార్‌లో హవాలా ముఠా గుట్టురట్టయింది. బేగంబజార్‌లో భారీగా హవాలా సాగుతున్నట్లు సమాచారం అందుకున్న సెంట్రల్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించి.. ముగ్గురు హవాలా వ్యాపారులను పట్టుకున్నారు. రెండు ద్విచక్రవాహనాలపై ముగ్గురు వ్యక్తులు హవాలా నగదును రవాణా చేస్తుండగా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వారిని పట్టుకుని బేగంబజార్ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. వారి నుంచి సుమారు రూ.70.63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్‌లో హవాలా ముఠా గుట్టురట్టు
Follow us on