ఘట్‌కేసర్ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో.. నలుగురికి అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు

|

Feb 11, 2021 | 1:04 PM

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బీ ఫార్మసీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆటో డ్రైవర్‌తో సహా...

ఘట్‌కేసర్ ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నం కేసులో.. నలుగురికి అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
Follow us on

హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో బీ ఫార్మసీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఆటో డ్రైవర్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. యువతిపై నిందితులు రాడ్‌తో దాడి చేయడంతోకాలిపై గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలు తీవ్ర భయాందోళనలో ఉందని, ఏం జరిగిందో చెప్పలేకపోతోందని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు.

కాగా, సదరు బాధితురాలు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం రాంపల్లికి చెందిన చెందిన అమ్మాయి కండ్లకోయలోని ఓ కాలేజీలో బీ ఫార్మసీ చదువుతోంది. ఎప్పటిలాగానే కాలేజీకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో నాగారంలో బస్సు దిగి రాంపల్లిలోని ఆర్‌ఎల్‌ నగర్‌ బస్టాప్‌ వెళ్లేందుకు సెవన్‌ సీటర్‌ ఆటో ఎక్కింది. ఆమెతో పాటు తన సీనియర్, ఇద్దరు ప్యాసింజర్లు కూడా ఆటోలో ఉన్నారు. అయితే, కొద్ది దూరం వెళ్లాక ఆ ముగ్గురూ దిగిపోయారు. ఆటోలో ఒంటరిగా ఉన్న అమ్మాయి చూసిన ఆటో డ్రైవర్‌తో పాటు మరి కొందరు ఘట్‌కేసర్‌ ఓఆర్‌ఆర్‌ ఇంటర్‌ చేంజ్‌ సర్వీసు రోడ్డుకు సమీపంలోని ఓ భవనం వద్దకు ఆమెను తీసుకెళ్లారు.

అప్పటికీ పోలీసులు తమను వెంటాడుతున్నారని భావించిన నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే టో డ్రైవర్‌తో జరిగిన పెనుగులాటలో బాధితురాలి కుడికాలికి గాయమైంది. ఎట్టకేలకు రాత్రి 7:50 గంటల ప్రాంతంలో బాధితురాలి వద్దకు చేరుకున్న పోలీసులు వారి వాహనంలోనే జీడిమెట్లలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Pharmacy Student: బీఫార్మసీ విద్యార్థిని అత్యాచారయత్నం కేసు.. కీలక విషయాలు బయటపెట్టిన వైద్యురాలు