KBR Park: కేబీఆర్ పార్క్‌లో నెమళ్ల లెక్క తేలింది.. ఎన్ని ఉన్నాయో తెలుసా?

|

Dec 01, 2021 | 6:06 PM

Peacock Day 2021: డిసెంబర్ 3న జాతీయ నెమళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరబాద్‌ కేబీఆర్‌ నేషనల్‌ పార్కులో నెమళ్లను లెక్కించే కార్యక్రమాన్ని అధికారులు

KBR Park: కేబీఆర్ పార్క్‌లో నెమళ్ల లెక్క తేలింది.. ఎన్ని ఉన్నాయో తెలుసా?
Kbr Park
Follow us on

Peacock Day 2021: డిసెంబర్ 3న జాతీయ నెమళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరబాద్‌ కేబీఆర్‌ నేషనల్‌ పార్కులో నెమళ్లను లెక్కించే కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. సీసీఎఫ్‌ ఎంజే అక్బర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ గణనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. మూడురోజుల పాటు కేబీఆర్‌ పార్కులో నెమళ్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్కన్ బర్డ్‌వాచర్స్‌, డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ స్వచ్చంద సంస్థలకు చెందిన 35 మంది వాలంటీర్ల సహాయంతో ఈ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కేబీఆర్‌ పార్క్‌లో మొత్తం 512 నెమళ్లు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. పార్కులోని అన్ని ప్రాంతాల్లో తిరిగే నెమళ్ల సంఖ్య ఇదేనంటూ అధికారులు అంచనావేశారు.

డిసెంబర్‌ 3న పీకాక్ డే ను పురస్కరించుకొని ఈ గణనను చేపట్టారు. అయితే.. పార్కులో గతంతో పోలిస్తే నెమళ్ల సంఖ్య పెరిగిందా, తగ్గిందా అనే అంశాలను అధికారులు వెల్లడించాల్సి ఉంది. హైదరాబాద్‌ సీసీఎఫ్‌ ఎంజే అక్బర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో జోజి, శంకరన్‌, జ్యోతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.

Kbr Park

Also Read:

TSRTC: ప్రయాణికులకు షాకింగ్ న్యూస్..పెరుగనున్న టికెట్ల ధరలు.. కిలోమీటర్‌కు ఎంతో తెలుసా..

IMD Prediction: డిసెంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. మరికొన్ని చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు..