Hyderabad: యాప్‌లో పరిచయం.. గదికి పిలిచి దోపిడీ.. ఐదుగురు అరెస్ట్!

ఆన్‌లైన్‌ యాప్‌లో పరిచయం పెంచుకోవడం.. నమ్మించి గదికి రప్పించడం.. ఆ తర్వాత మత్తుమందు ఇచ్చి దోచుకోవడం! ఇదీ ఓ ముఠా దోపిడీ స్కెచ్‌! హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఈ తరహా దందా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు కథనం లోపల .. ..

Hyderabad: యాప్‌లో పరిచయం.. గదికి పిలిచి దోపిడీ.. ఐదుగురు అరెస్ట్!
Scam

Updated on: Nov 16, 2026 | 6:30 PM

ఆన్‌లైన్‌లో పరిచయం పెంచుకుని.. నమ్మకంగా మాట్లాడి.. చివరకు గదికి పిలిచి దోచుకోవడం! ఇదేదో సినిమా కథ కాదు.. హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ముఠా దందా! ఆన్‌లైన్‌ యాప్‌ల ద్వారా యువకులతో పరిచయాలు పెంచుకుంటూ, వారిని పక్కా ప్రణాళికతో గదికి రప్పించి దోపిడీకి పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠా గుట్టును కుషాయిగూడ పోలీసులు రట్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఓ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా స్వలింగ సంపర్కులైన యువకులను లక్ష్యంగా చేసుకునేవారు. ముందుగా యాప్‌లో పరిచయం పెంచుకుని, వారితో సన్నిహితంగా మాట్లాడేవారు. ఆ తర్వాత వారిని తమకు అనుకూలమైన గదికి రావాలని ఆహ్వానించేవారు. అలా తమ దగ్గరకు వచ్చిన యువకులకు మత్తుమందు ఇచ్చి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత వారి వద్ద ఉన్న నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకునేవారు.

ఇంతటితో ఆగకుండా.. బాధితుల వద్ద నగదు, బంగారం వంటి విలువైన వస్తువులు ఏమీ లేకపోతే మరో మార్గాన్ని ఎంచుకునేవారు. వారితో రహస్యంగా వీడియోలు తీసి, వాటిని బయటపెడతామంటూ బెదిరింపులకు దిగేవారు. పరువు పోతుందనే భయాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఇలా పరిచయాల పేరుతో యువకులను వలలో వేసుకుని, మత్తుమందు ఇచ్చి దోపిడీ చేయడంతో పాటు వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంపై సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు 35 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా చేతిలో ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? ఇప్పటివరకు ఎంతమేర దోపిడీకి పాల్పడ్డారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరిచయాల మాటున సాగుతున్న ఈ దోపిడీ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us