హైదరాబాద్‌లోని నాంపల్లిలో కుప్పకూలిన పురాతన భవనం! 

| Edited By:

Oct 19, 2019 | 6:22 PM

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. భవనంలో తలదాచుకుంటున్న యాచకుల్లో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హెరిటేజ్ భవనం శనివారం (అక్టోబర్ 19) మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలిన సమాచారం అందిన వెంటనే అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనాన్ని పూర్తిగా […]

హైదరాబాద్‌లోని నాంపల్లిలో కుప్పకూలిన పురాతన భవనం! 
Follow us on

హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఓ పురాతన భవనం కుప్పకూలింది. భవనంలో తలదాచుకుంటున్న యాచకుల్లో పలువురు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాంపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హెరిటేజ్ భవనం శనివారం (అక్టోబర్ 19) మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. భవనం కూలిన సమాచారం అందిన వెంటనే అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. భవనాన్ని పూర్తిగా కూల్చివేసే పనులు కొనసాగిస్తున్నారు.