మూసీ సుందరీకరణపై కేటీఆర్ ఫోకస్

|

Jun 28, 2020 | 6:41 AM

హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం..

మూసీ సుందరీకరణపై కేటీఆర్ ఫోకస్
Follow us on

హైదరాబాద్‌ పరిధిలోని ప్రభుత్వ భూముల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్‌. ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తులకు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు.రెవిన్యూ, దేవాదాయ భూముల పైన ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా చోట్ల స్థలాలకు కూడా జియో ఫెన్సింగ్ వేయడంతో పాటు GIS మ్యాపింగ్ చేయాలన్నారు.

అటు మూసీ రివర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్‌పై కూడా మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. కార్పొరేషన్ చైర్మన్ సుధీర్‌రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. మూసీ ప్రక్షాళనకు సంబంధించి సీఎంకి స్పష్టమైన ఆలోచన ఉన్నదని…ఆ ఆలోచన మేరకే కార్పొరేషన్ ముందుకు తీసుకుపోవాలని మంత్రి కేటీఆర్ తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో మూసీలో పేరుకుపోయిన చెత్తను, పిచ్చి మొక్కలను దశలవారీగా తీసివేసే కార్యక్రమం కొనసాగించాలని కేటీఆర్‌ సూచించారు.దోమల బెడదను కొంత వరకు తగ్గించగలిగే అవకాశం ఉందన్న ఆయన.. మూసీ వెంబడి ఫెన్సింగ్ వేయడంతోపాటు చెత్త వేయకుండా,కబ్జాలకు గురి కాకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.