హైదరాబాద్‌లో మొదలైన మెట్రో సర్వీసులు.. వారికి ‘నో’ ఎంట్రీ

| Edited By:

Sep 07, 2020 | 8:16 AM

దాదాపు ఐదు నెలల తరువాత హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో

హైదరాబాద్‌లో మొదలైన మెట్రో సర్వీసులు.. వారికి నో ఎంట్రీ
Follow us on

Hyderabad Metro Services: దాదాపు ఐదు నెలల తరువాత హైదరాబాద్‌లో మెట్రో సర్వీసులు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా నేపథ్యంలో మూడు దశల్లో మెట్రోను ప్రారంభించనున్నారు. మొదటి ఫేజ్‌లో భాగంగా ఇవాళ మియపూర్ నుంచి ఎల్బీ నగర్ వరకు సర్వీసులు నడవనున్నాయి. దీనికి సంబంధించి మెట్రో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక మాస్క్ లేకపోయినా ,టెంపరేచర్ ఎక్కువగా ఉన్న మెట్రోలోకి అనుమతించడం లేదు. ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. అలాగే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది. మరోవైపు భౌతిక దూరం విషయంలో మార్కింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. సీటు, సీటుకు మధ్యలో మార్కింగ్ ఉండనుంది. భౌతిక దూరం విషయంలో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండేలా సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేయనున్నారు.

Read More:

సెంట్రల్‌ జైలుకి నూతన్‌ నాయుడు

మరో ఐపీఎల్‌ జట్టులో కరోనా కలకలం