Water Bottle Shaped Dustbin: పర్యాటకులతో కళకళాడే నెక్లెస్ రోడ్.. ఆకట్టుకుంటోన్న వేస్ట్ బాటిల్ నమూనా డస్ట్ బిన్

|

Jul 02, 2021 | 7:18 PM

Water Bottle Shaped Dustbin: హైదరాబాద్ లో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిల్లో ఒకటి హుస్సేన్ సాగర్. ఈ సాగర్ లో కొలువైన బుద్ధ విగ్రహంతో పాటు.. నాలుగు వైపులా ఉండే ప్రదేశాలు పర్యాటకులను..

Water Bottle Shaped Dustbin: పర్యాటకులతో కళకళాడే నెక్లెస్ రోడ్.. ఆకట్టుకుంటోన్న వేస్ట్ బాటిల్ నమూనా డస్ట్ బిన్
Water Bottle Shaped Dustbin
Follow us on

Water Bottle Shaped Dustbin: హైదరాబాద్ లో అనేక పర్యాటక ప్రాంతాలున్నాయి. వాటిల్లో ఒకటి హుస్సేన్ సాగర్. ఈ సాగర్ లో కొలువైన బుద్ధ విగ్రహంతో పాటు.. నాలుగు వైపులా ఉండే ప్రదేశాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు , సంజీవయ్య పార్క్, లుంబినీ పార్క్, ఎన్టీఆర్ మార్గ్ .. హుస్సేన్ సాగర్ కు మరింత అందాన్ని తీసుకుని వచ్చి ఆకర్షణీయంగా మార్చాయి.

ఎన్టీఆర్ మార్గ్….. నిత్యం వేలాది మంది నగర వాసులు, పర్యాటకులతో కళకళ లాడుతూ ఉండే మార్గం. అయితే, ఇక్కడికి వచ్చే పర్యాటకులు తాము తాగే వాటర్ బాటిళ్ల ను ఎక్కడ పడితే అక్కడ వేస్తున్నారు. అయితే నగర సుందరీ కరణలో భాగంగా బాటిల్స్ ను డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలని చైతన్య పరిచే విధంగా జీహెచ్ఎంసీ ఓ వినూత్న ప్రయోగం చేసింది. తాజాగా వాటర్ బాటిల్ మాదిరిగా ఐరన్ తో చేసిన పెద్ద బాటిల్ నమూనా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణ గా మారింది. తమ వద్ద ఉన్న ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను వేసేందుకు ప్రత్యేకంగా ఈ బాటిల్ మాదిరి డస్ట్ బిన్ ను జీహెచ్ఎంసీ తయారు చేయించింది. బాటిళ్లను నిర్దేశిత ప్రదేశంలో వేయడం పై పర్యాటకులను చైతన్య పరిచేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్. ఆదేశించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ఈ వినూత్నడస్ట్ బిన్ మాదిరి మోడల్ ను ఎన్టీఆర్ మార్గ్ ( నెక్లస్ రోడ్) పై ఏర్పాటు చేశారు. ఇది పలువురిని ఆకట్టుకుంటోంది.

Also Read: ఈజీగా టేస్టీగా అరగంటలో తయారు చేసుకునే టమాటా పికిల్ రెసిపీ.. ఒక నెల వరకూ నిల్వ