కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేస్.. దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్

|

Aug 17, 2024 | 9:04 PM

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది . దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

కోల్‌కతా డాక్టర్ మర్డర్ కేస్.. దేశవ్యాప్తంగా ఓపీ సేవలను బహిష్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
Medicover
Follow us on

కోల్‌కతా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన అఘాయిత్యానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చిన సమ్మెకు మెడికవర్ హాస్పిటల్స్ పూర్తి మద్దతునిచ్చింది . దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికవర్ ఆసుపత్రులలో ఓపీ సేవలను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ అధినేత, చైర్మన్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ.. “ఇలాంటి అమానవీయమైన సంఘటనతో దేశం విస్తుపోయింది. యావత్ భారతావని దిగ్భాంతికి లోనయింది. ఈ సంఘటన అందరిని కలిచివేసింది. అత్యంత హేయమైన ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలి” అని అన్నారు.

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ.. ” నేడు దేశమంతా ఏకమై సమైక్య గళం వినిపిస్తున్నది. ఈ సంఘటన అత్యంత భాదాకరమైనది. ఈ సంఘటనను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మేము అందరం బాధితురాలికి మద్దతునిస్తూ మా ఓపీ సేవలను బహిష్కరించాం”. అని అన్నారు

ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ “ప్రజల ప్రాణాలు కాపాడే ఒక డాక్టర్‌కు ఇలా జరగడం దారుణాతిదారుణం. ఈ ఘటన నన్నెంతో బాధకు గురిచేసింది. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండే విధంగా ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని శిక్షించాలి, ఆ బంగారుతల్లి ఆత్మ శాంతించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నారు.