జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం.. ఇకపై 16 నిమిషాల్లోనే..!

| Edited By:

Feb 07, 2020 | 4:57 PM

హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. మెట్రో ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఇవాళ చోటుచేసుకుంది. కారిడార్‌ 2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో కేసీఆర్ ఈ మెట్రోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రూట్‌లో 9 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, […]

జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో ప్రారంభం.. ఇకపై 16 నిమిషాల్లోనే..!
Follow us on

హైదరాబాద్‌వాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తీరనున్నాయి. మెట్రో ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం ఇవాళ చోటుచేసుకుంది. కారిడార్‌ 2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రోను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో కేసీఆర్ ఈ మెట్రోను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాసయాదవ్‌తో పాటు పలువురు హాజరయ్యారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రూట్‌లో 9 స్టేషన్లు ఉంటాయి. జేబీఎస్ పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, గాంధీ ఆసుపత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్ మీదుగా రైలు ఎంజీబీఎస్ చేరుకోనుంది. ఈ మెట్రో ద్వారా జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్ చేరుకునేందుకు కేవలం 16 నిమిషాల సమయం పట్టనుంది. దీంతో హైదరాబాద్‌వాసులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.