కార్పొరేట్ కాలేజీల్లో.. విద్యార్థులకు నో ఫైర్ సేఫ్టీ

| Edited By: Srinu

Jul 25, 2019 | 7:26 PM

ఫీజుల మైకంలో పడి కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 75 కాలేజీలు ఐదంతస్థుల భవనాల్లో కొనసాగుతుండగా ఏ కాలేజీలోనూ ఫైర్ సేఫ్టీ నివారణ చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని ఇంటర్మీడియట్ కాలేజీలపై బోర్డు కొరడా విధించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1338 కాలేజీలకు గుర్తింపు నిరాకరించింది. కేవలం 361 కాలేజీలకు మాత్రమే అనుమతి లభించింది. దీంతో నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. దీనిపై విద్యార్థులు, […]

కార్పొరేట్ కాలేజీల్లో.. విద్యార్థులకు నో ఫైర్ సేఫ్టీ
Follow us on

ఫీజుల మైకంలో పడి కార్పొరేట్ కాలేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. రాష్ట్రంలోని సుమారు 75 కాలేజీలు ఐదంతస్థుల భవనాల్లో కొనసాగుతుండగా ఏ కాలేజీలోనూ ఫైర్ సేఫ్టీ నివారణ చర్యలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించని ఇంటర్మీడియట్ కాలేజీలపై బోర్డు కొరడా విధించింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 1338 కాలేజీలకు గుర్తింపు నిరాకరించింది. కేవలం 361 కాలేజీలకు మాత్రమే అనుమతి లభించింది. దీంతో నాలుగు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిబంధనలు ఏమాత్రం పాటించడం లేదు. విద్యార్థుల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఈ విద్యా సంవత్సరం ఫైర్ సేఫ్టీ అనుమతులు కీలకంగా మారాయి. హైదరాబాద్ లోని అమీర్ పేట ప్రాంతంలో గల పలు కోచింగ్ సెంటర్లు ఫైర్ సేఫ్టీ చర్యలు పాటించని కారణంగా వాటిని సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా, నిబంధనలు సరిగా పాటించని కాలేజీల్లో శ్రీ చైతన్య, నారాయణ వంటివి ఉన్నాయి. అయితే ఈ నెలాఖరులోగా అనుమతులు తెచ్చుకోవాలని మెనేజ్‌మెంట్ నోటీసులు ఇచ్చినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తెలిపారు.