గాంధీ ఆసుపత్రిలో ‘టిక్‌టాక్’.. జూనియర్ డాక్టర్లపై వేటు

| Edited By:

Jul 26, 2019 | 1:36 PM

టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. తాము చేస్తోన్న విధులను పక్కనపెట్టి మరీ టిక్‌టాక్‌లు చేస్తున్నారు కొందరు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు మినహాయింపు కాదు. నిన్నటికి నిన్న పోలీస్‌స్టేషన్‌లో టిక్‌టాక్ చేసిన ఓ మహిళా పోలీస్ సస్పెండ్‌కు గురవ్వగా.. తాజాగా హైదరాబాద్‌లోని జూనియర్ డాక్టర్లపై సంబంధిత అధికారులు వేటు వేశారు. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తోన్న సిబ్బంది చేసిన టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ వైపు వైద్యం కోసం రోగులు ఇబ్బందులు పడుతుంటే.. వారిని పట్టించుకోకుండా […]

గాంధీ ఆసుపత్రిలో ‘టిక్‌టాక్’.. జూనియర్ డాక్టర్లపై వేటు
Follow us on

టిక్‌టాక్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. తాము చేస్తోన్న విధులను పక్కనపెట్టి మరీ టిక్‌టాక్‌లు చేస్తున్నారు కొందరు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు మినహాయింపు కాదు. నిన్నటికి నిన్న పోలీస్‌స్టేషన్‌లో టిక్‌టాక్ చేసిన ఓ మహిళా పోలీస్ సస్పెండ్‌కు గురవ్వగా.. తాజాగా హైదరాబాద్‌లోని జూనియర్ డాక్టర్లపై సంబంధిత అధికారులు వేటు వేశారు.

గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తోన్న సిబ్బంది చేసిన టిక్‌టాక్‌ వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ వైపు వైద్యం కోసం రోగులు ఇబ్బందులు పడుతుంటే.. వారిని పట్టించుకోకుండా ఆ డాక్టర్లు టిక్‌టాక్‌లతో కాలక్షేపాలు చేస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారుల వరకు చేరడంతో.. వెంటనే వారిపై చర్యలు చేపట్టారు. ఫిజియోథెరపీ విభాగంలో టిక్‌టాక్ చేసిన జూనియర్ వైద్యులను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఆ విభాగం ఇన్‌ఛార్జ్‌ను కూడా ఆసుపత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేశారు. దీనిపై సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. టిక్‌టాక్ చేసిన వారిద్దరు శిక్షణ కోసం ఇతర కాలేజీల నుంచి ఇక్కడకు వచ్చారని.. ఈ ఘటనతో గాంధీ వైద్య కళాశాల విద్యార్థులకు సంబంధం లేదని అన్నారు.