Hyderabad: మేడ్చల్‌లో ఐఎస్ఐ ఏజెంట్ కలకలం.. పక్కా సమాచారంతో హోటల్‌పై దాడులు చేయగా..

హైదరాబాద్‌ పరిధిలోని మేడ్చల్‌లో పాకిస్తాన్ ఐఎస్‌ఐ మద్దతు ఉన్న ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు పెంచుకునేందుకు ప్రయత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాయేద్ ఖాన్‌ మేడ్చల్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఉగ్రవాద గ్రూపులతో సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తేలింది. నిందితుడి మొబైల్‌లో అనుమానాస్పద చాటింగ్‌లు, కాల్ రికార్డులు, వీవీఐపీలకు సంబంధించిన కీలక సమాచారం లభ్యమైంది.

Hyderabad: మేడ్చల్‌లో ఐఎస్ఐ ఏజెంట్ కలకలం.. పక్కా సమాచారంతో హోటల్‌పై దాడులు చేయగా..
UP Youth Arrested in Medchal Hotel

Updated on: May 25, 2026 | 11:42 AM

హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ISI) మద్దతు ఉన్న ఒక ఉగ్రవాద ముఠాతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్ హోటల్‌లో పనిచేస్తున్న ఆ యువకుడిని పోలీసులు నిఘా వర్గాల సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్ట్ అయిన నిందితుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘాజియాబాద్‌కు చెందిన జాయేద్ ఖాన్‌గా గుర్తించారు. అతను మేడ్చల్‌లోని ముబారక్ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ బ్యాకింగ్ ఉన్న ఒక నిషేధిత గ్రూపులో చేరాలనే ఆసక్తితో జాయేద్ ఖాన్ ఉన్నట్లు విచారణలో తేలింది. ఇందుకోసం అతను తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సదరు ముఠా సభ్యులను సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి అతని మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పరిశీలించగా.. అనుమానిత గ్రూపులతో అతను జరిపిన చాటింగ్‌లు, స్క్రీన్‌షాట్‌లు, కాల్ రికార్డులు లభ్యమయ్యాయి. నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, కోర్టు అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అతడిని జైలుకు తరలించారు.

వెలుగులోకి కీలక విషయాలు..

మేడ్చల్‌లో అరెస్ట్ అయినా టెర్రరిస్ట్ జహేద్ ఖాన్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగుచూశాయి.. పాకిస్థాన్ వస్తా ఉగ్రదాడుల్లో శిక్షణ ఇవ్వండి అంటూ టెర్రరిస్టు ముఠాలతో ఆన్లైన్ చాటింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కొందరు ప్రముఖుల వివరాలు ఐఎస్ఐఐకి చేరవేసినట్లు గుర్తించారు. జయీద్ ఖాన్ నుంచి రెండు డమ్మీ పిస్టళ్లు, మొబైల్ ఫోన్లు, కొంతమంది వీవీఐపీలకు చెందిన కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. దేశ వ్యతిరేక కార్యక లాపాలపై రీల్స్, తుపాకులు పట్టుకుని దిగిన ఫొటోలను తన ఇన్ స్టాగ్రాంలో జయీద్ ఖాన్ పోస్ట్ చేసినట్లు గుర్తించారు. ఇద్దరు యువకులు హబీబ్, రాణా ద్వారా జయీద్ ఖాన్ తుపాకులను పొందినట్లు గుర్తించారు..

జయీద్ తనకు ఆయుధాలు సమకూర్చాలని హబీబ్, రాణాలను కోరడంతో వారు పాకిస్థాన్ లోని ఐఎస్ఐకి చెందిన షహబాజ్ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేశారు. అయితే.. భారత్లోని కొందరు వీవీఐపీల వివరాలను అందజేయాలని ఉగ్రవాద సంస్థలు అడిగినట్లు పోలీసులు తెలిపారు. జయీద్ ఇన్స్టాగ్రాంలో పెడుతున్న పోస్టులు, ఉగ్రవాద లింకుల పై కౌంటర్ ఇంటలిజెన్స్ ఆరా తీశాయి..పాక్ నుంచి అతనికి అందుతున్న ఆదేశాలను ట్రాక్ చేసిన కేంద్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలు .. పోలీసులకు సమాచారం అందించాయి.. దీంతో అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us