జూన్ రెండోవారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు..!

|

May 28, 2020 | 2:47 PM

కరోనా లాక్ డౌన్​ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ​ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ ​తో పాటు ఓంఎంఆర్​స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల […]

జూన్ రెండోవారంలో ఇంటర్ పరీక్ష ఫలితాలు..!
Follow us on

కరోనా లాక్ డౌన్​ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్ వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ​ ప్రక్రియను ఈ నెలాఖరుతో పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ ​తో పాటు ఓంఎంఆర్​స్కానింగ్ ప్రాసెస్ కూడా ఏకకాలంలో పూర్తి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్‌బోర్డు, ఈ ఏడాది తొలుత సెకండియర్‌ ఫలితాలు విడుదలచేయాలని భావిస్తోంది.
లాక్ డౌన్ లో అలస్యంగా మొదలైనప్పటికీ.. ఇంటర్ సెకండియర్ వాల్యుయేషన్ మూడు రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం ఫస్టియర్​ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్​వాల్యుయేషన్ కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ పేపర్లు కూడా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. రిజల్ట్స్​ప్రాసెస్​ను వారం, పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రతలు తీసుకున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్.