63ఏళ్ల భామకు మిస్సెస్‌ ఇండియా తెలంగాణ కిరిటం

|

Nov 09, 2019 | 3:36 PM

తెలంగాణ – 2019 అందాల పోటీల సూపర్‌ క్లాసిక్‌ కేటగిరీలో డాక్టర్‌ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. 63 ఏళ్ల శోభాదేవి  లండన్‌లో ఫేమస్‌ డాక్టర్‌గా గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్లో వైద్య సేవలు అందించారు. అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్‌ వచ్చిన శోభాదేవి హైదరాబాద్‌లోని లైఫ్‌ స్పాన్‌ ఆస్పత్రిలో డయాబెటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్‌ రంగం ప్రవృత్తి అని […]

63ఏళ్ల భామకు మిస్సెస్‌ ఇండియా తెలంగాణ కిరిటం
Follow us on

తెలంగాణ – 2019 అందాల పోటీల సూపర్‌ క్లాసిక్‌ కేటగిరీలో డాక్టర్‌ నక్కాన శోభాదేవి విజేతగా నిలిచి అందాల భామ కిరీటం దక్కించుకున్నారు. 63 ఏళ్ల శోభాదేవి  లండన్‌లో ఫేమస్‌ డాక్టర్‌గా గుర్తింపు ఉంది. ఆమె రెండు దశాబ్దాల పాటు లండన్లో వైద్య సేవలు అందించారు. అయితే మాతృభూమికి ఏదైనా చేయాలన్న తపనతో భారత్‌ వచ్చిన శోభాదేవి హైదరాబాద్‌లోని లైఫ్‌ స్పాన్‌ ఆస్పత్రిలో డయాబెటాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు వైద్యం వృత్తి అయితే ఫ్యాషన్‌ రంగం ప్రవృత్తి అని చెప్పాలి. ఆ మక్కువతోనే మిసెస్‌ ఇండియా తెలంగాణ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు..ఏకంగా టైటిల్‌ ఎగరేసుకెళ్లారు. 63 ఏళ్ల ఏజ్‌లోనూ అందాల పోటీలలో పాల్గొని అందరి మనసులు గెలుచుకుని టైటిల్‌ సాధించారు శోభాదేవి.