GHMC Standing Committee: గ్రేటర్‌లో గులాబీ పార్టీ మరో విజయం.. జీహెచ్ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఏకగ్రీవం

|

Nov 16, 2021 | 8:31 AM

గ్రేటర్ హైదరబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గులాబీ పార్టీ మరో విజయం సాధించింది. అనుకున్నట్లుగానే స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. మజ్లిస్ తో కలిసి గులాబీ పార్టీ పాగా వేసింది.

GHMC Standing Committee: గ్రేటర్‌లో గులాబీ పార్టీ మరో విజయం.. జీహెచ్ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఏకగ్రీవం
Ghmc
Follow us on

GHMC Standing Committee Election: గ్రేటర్ హైదరబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గులాబీ పార్టీ మరో విజయం సాధించింది. అనుకున్నట్లుగానే స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. మజ్లిస్ తో కలిసి గులాబీ పార్టీ పాగా వేసింది. స్టాండింగ్‌ కమిటీ ఎన్నిక ఈసారి యునానిమస్‌ అయింది. మజ్లీస్‌, కారు గుర్తు పార్టీలు పరస్పర ఒప్పందంతో ఎక్స్‌ట్రా నామినేషన్లు విత్‌ డ్రా చేసుకోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.

GHMC స్టాండింగ్ కమిటీ పోరు ఏకగ్రీవమైంది. అధికార TRS నుంచి ముగ్గురు కార్పోరేటర్లు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో స్టాండింగ్ సస్పెన్స్ కు తెరపడింది. దీంతో 15 స్థానాలకు 15 మంది పోటీలో ఉండటంతో వారే విజేతలుగా గ్రేటర్ కమిషనర్ లోకేష్ కుమారు ప్రకటించారు. TRS కార్పోరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, సంగీత యాదవ్ ఉపసంహరించుకున్నారు.

TRS – MIM తొలుత 9-6 చొప్పున డీల్ ఓకే చేసుకోగా.. TRS నుంచి 11, MIM నుంచి 7 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక్కడే గ్రేటర్ లీడర్లలో టెన్షన్ మొదలైంది. అదనంగా ఉన్న ముగ్గురు ఎవరు తప్పుకోవాలన్న విషయంలో చివరివరకు చర్చ జరిగింది. అనూహ్యంగా అధికార TRS నుంచే ముగ్గురు తప్పుకోవడంతో 8-7 తరహాలో మిత్రపక్షాలు స్టాండంగ్ కమిటీని పంచుకున్నట్లు అయింది. గత స్టాండింగ్ కమిటీలో గులాబీ, మజ్లిస్ పార్టీలు 9 – 6 ప్రకారం ఏకగ్రీవం చేసుకున్నాయి. కానీ, ఈసారి మజ్లీస్ పార్టీ 7 స్థానాలు కావాలని పట్టుబట్టడంతో తప్పనిపరిస్థితి నెలకొంది. స్టాండింగ్ కమిటీ సభ్యులు గెలిచిన వారు టీఆర్ఎస్ నుంచి కుర్మ హేమలత, పన్నాల దేవేందర్ రెడ్డి, ప్రేమ్ కుమార్, మందాడి శ్రీనివాస్ రావు, రావుల శేషగిరి, సీఎన్ రెడ్డి, విజయ్ కుమార్ గౌడ్, సామల హేమ.. మజ్లిస్ పార్టీ నుంచి ప్రవీణ్ సుల్తానా, బాత జబీన్, మహాపార, మందగిరి స్వామి, మీర్జా ముస్తాఫ బేగ్, మహమ్మద్ అబ్దూల్ సలామ్, ఎండీ రషీద్ విజయం సాధించారు.

గ్రేటర్ పరిధిలో అభివృద్ధి పనుల కోసం జరిగే నిర్ణయాల్లో స్టాండింగ్ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. మరోవైపు, బీజేపీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక విధానాన్ని తప్పుబట్టింది. 47 మంది కార్పోరేటర్లు ఉన్న తమకు కమిటీలో చోటదక్కే అవకాశం లేకపోవడం సరికాదంటూ విమర్శించారు. ఎన్నికల విధానంతో ఏటూ అవకాశం లేని బీజేపీ కార్పోరేటర్లు ఎన్నికకు దూరంగానే ఉన్నారు.

Read Also… Postmortem in Night: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై సూర్యాస్తమయం తర్వాత కూడా పోస్టుమార్టంకు అనుమతి